తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆ రాష్ట్రాల్లో ట్రంప్ గెలిస్తే ఫలితాలు తారుమారే! - అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020 ఓట్ల లెక్కింపు

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ట్రంప్​, బైడెన్​ పోటాపోటీగా సాగుతున్నారు. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో బైడెన్​ ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. కీలక రాష్ట్రాల్లో ట్రంప్ హవా కొనసాగుతోంది. ఇద్దరి మధ్య తేడా అతిస్వల్పంగా ఉండటం వల్ల ఉత్కంఠ పెరిగిపోతోంది.

US Elections 2020
ట్రంప్

By

Published : Nov 4, 2020, 11:17 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు విడుదలవుతోన్న కొద్దీ ఉత్కంఠ తారస్థాయికి చేరుకుంటోంది. ప్రధాన అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. ఎలక్టోరల్ ఓట్లలో బైడెన్​ చాలా ముందంజలో ఉన్నప్పటికీ.. కీలక రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యం కొనసాగుతోంది.

గెలుపును నిర్దేశించే రాష్ట్రాలైన టెక్సాస్, ఫ్లోరిడా, జార్జియా, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. ఈ స్థానాల్లో ట్రంప్ గెలిస్తే ప్రస్తుతం నెలకొన్న అంచనాలు తారుమారు అయ్యే అవకాశం ఉంది. ఇద్దరు అభ్యర్థుల మధ్య తేడా అతిస్వల్పంగా ఉండడం ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఇదీ చూడండి:ట్రంప్ గెలుపునకు ఈ మెలికే కారణం!

ABOUT THE AUTHOR

...view details