తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా ఎన్నికల్లో ఆ రికార్డు ఎప్పటికీ పదిలమే! - అమెరికా ఎన్నికలు 1876 రికార్డు

అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో 1876 రికార్డు ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో 81.8 శాతం మంది ఓట్లు వేశారు. ప్రస్తుత ఎన్నికల్లో భారీగా ఓటింగ్ నమోదైనప్పటికీ ఆ రికార్డును చేరుకోవటం అసాధ్యమే.

1876 election
అమెరికా

By

Published : Nov 4, 2020, 8:06 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఈ సారి భారీ ఓటింగ్ నమోదైంది. ఇటీవలి కాలంలో ఇదే అత్యధికమయ్యే అవకాశముంది. అయితే, 1876 ఎన్నికల రికార్డుకు కనీసం సమీపానికి కూడా చేరుకోలేదు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో 81.8 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకోవటం విశేషం.

1876 ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి సామ్యూల్ టిల్​డెన్​ కన్నా తక్కువ ఓట్లు వచ్చినా రిపబ్లికన్ అభ్యర్థి రూథర్​ఫర్డ్ హేయస్ గెలుపొందారు. 20 ఎలక్టోరల్​ ఓట్లు వివాదం కారణంగా ఎవరికీ మెజారిటీ దక్కలేదు. ఫలితంగా ప్రతినిధుల సభ ఓ కమిషన్​ ఏర్పాటు చేసి హేయస్​కు అధ్యక్షుడిని చేసింది.

19వ శతాబ్దంలో..

అమెరికాలో 1828 వరకు స్పష్టమైన సమాచారం లేనప్పటికీ 19 శతాబ్దంలో కనీసంగా 70 శాతం పోలింగ్ నమోదయ్యేదని తెలుస్తోంది. అబ్రహం లింకన్​ అధ్యక్షుడిగా గెలిచిన 1860 ఎన్నికల్లో 81.2 శాతం ఓటింగ్ నమోదైంది. ఇప్పటివరకు ఇదే రెండో అత్యధికం.

  • 1920, 1924 ఎన్నికల్లో వరుసగా 49.2 శాతం, 48.9 శాతానికి ఓటింగ్ పడిపోయింది. మహిళలకు అప్పుడే ఓటుహక్కు లభించటం వల్ల ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. కానీ ఎక్కువ మంది ఓటు వేయలేదు.
  • అప్పటి నుంచి 50-60 శాతం మధ్య ఓటింగ్ నమోదవుతూ వస్తోంది. హుబర్ట్ హంఫ్​రేపై రిపబ్లికన్ అభ్యర్థి రిచర్డ్ నిక్సన్ గెలుపొందిన 1968 ఎన్నికల్లో చివరి సారిగా 60 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.
  • ఇటీవలి కాలంలో గమనిస్తే 1996 ఎన్నికల్లో అత్యల్ప ఓటింగ్ నమోదైంది. రిపబ్లికన్ బాబ్​ డోల్​ను బిల్ ​క్లింటన్​ ఓడించిన ఈ ఎన్నికల్లో 49 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • 2016లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలిచిన ఎన్నికల్లో 59.2 శాతం మంది ఓట్లేశారు.

ఇదీ చూడండి:ట్రంప్xబైడెన్: రికార్డు ఓటింగ్- హోరాహోరీ ఫలితాలు

ABOUT THE AUTHOR

...view details