అమెరికా ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ దాదాపు అధ్యక్ష పీఠానికి దగ్గరలోనే ఉన్నా.. ఇంకా లెక్కింపు జరుగుతున్న కారణంగా ఫలితాలు తారుమారయ్యే అవకాశం లేకపోలేదు.
ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి కీలక పరిణామాలు ఇలా..
1. అడుగు దూరంలో బైడెన్..
మొదటి నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన బైడెన్.. స్వింగ్ రాష్ట్రాలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుచుకోగా వెనకబడ్డారు. అయితే, కీలక రాష్ట్రాలైన మిషిగన్, విస్కాన్సిన్లో గెలుపొంది తిరిగి దూసుకెళ్లారు. ఇప్పటివరకు 437 ఎలక్టోరల్ ఓట్ల ఫలితాలు వెలువడగా.. బైడెన్ 264 గెలుచుకుని మ్యాజిక్ ఫిగర్‌కు అడుగు దూరంలో నిలిచారు. ట్రంప్ 214 సీట్లు దక్కించుకున్నారు.
2. తేలాల్సిన లెక్కలివే..
పెన్సిల్వేనియా, జార్జియా, నార్త్ కరోలైనా, నెవడా, అలస్కా రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఈ రాష్ట్రాల్లో మొత్తం 60 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. వీటిల్లో ట్రంప్ ఆధిక్యంలో ఉన్న 4 రాష్ట్రాల్లో 54 ఓట్లు ఉండగా.. బైడెన్ ముందంజలో ఉన్న నెవడాలో 6 ఓట్లు ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాలను గెలుచుకోగలిగితే ట్రంప్ మళ్లీ అధ్యక్షుడయ్యే అవకాశం ఉంది.
3. ఈ నెల 12 వరకు లెక్కింపు!
అమెరికా ఎన్నికల ఫలితాలు ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించటం లేదు. కొన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ఈ నెల 12 వరకు కొనసాగనుంది. నార్త్ కరోలినాలో ఈ నెల 6 నుంచి 12 వరకు పోస్టల్ బ్యాలెట్లు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాతే అధికారిక ప్రకటన వెలువడుతుంది.
4. కోర్టుకెక్కిన ట్రంప్..
మొదట మిషిగన్, విస్కాన్సిన్లో ట్రంప్ ఆధిపత్యం ప్రదర్శించగా.. వాటిని బైడెన్ తన ఖాతాలో వేసుకున్నారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలపై డొనాల్డ్ ట్రంప్ బృందం కోర్టులను ఆశ్రయించింది. పెన్సిల్వేనియా, మిషిగన్‌లో లెక్కింపు నిలిపేసి.. నిపుణులైన పరిశీలకులను నియమించాలని కోరింది. విస్కాన్సిన్లో రీకౌంటింగ్ చేపట్టాలని అభ్యర్థించింది.
5. నిధుల సేకరణలో..