కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది అమెరికా. మహమ్మారి కారణంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక వ్యవస్థ పతనమైంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వార్షిక రేటు 33 శాతం క్షీణించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. సంక్షోభం కారణంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోవడం వల్ల నిరుద్యోగ రేటు గణనీయంగా 14.7 శాతానికి పెరిగినట్లు తెలిపింది.
కరోనా దెబ్బకు అమెరికా ఆర్థిక వ్యవస్థ 33 శాతం పతనం - us latest news
కరోనా మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యం ఛిన్నాభిన్నమైంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ 33 శాతం పతనమైనట్లు ప్రభుత్వం తెలిపింది. నిరుద్యోగం రేటు కూడా 14.7 శాతానికి పెరిగినట్లు వెల్లడించింది.

క్షీణించిన అమెరికా ఆర్థిక వ్యవస్థ
కొవిడ్ కారణంగా ప్రపంచంలోనే అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది అమెరికా. ఏ దేశంలో లేని విధంగా 4,583,662 మంది వైరస్ బారిన పడ్డారు. 154,187 మంది చనిపోయారు. ఆర్థిక రంగం తీవ్రంగా దెబ్బతింది.