తెలంగాణ

telangana

ETV Bharat / international

సూకీ నిర్బంధం పొడిగింపుపై అమెరికా ఆవేదన - మయన్మార్​ ఈటీవీ భారత్​

మయన్మార్​ తాజా పరిణామాలపై అమెరికా స్పందించింది. ఆంగ్​ సాన్​ సూకీ నిర్బంధాన్ని పొడిగించడంపై ఆవేదన వ్యక్తం చేసింది. మయన్మార్​ వ్యవహారంలో నిర్మాణాత్మక పాత్ర పోషించాలని చైనాకు పిలుపునిచ్చింది.

US 'disturbed' by additional charges filed against Aung San Suu Kyi
సూకీ నిర్బంధం పొడిగింపుపై అమెరికా ఆవేదన

By

Published : Feb 17, 2021, 10:47 AM IST

మయన్మార్​ కీలక నేత ఆంగ్​ సాన్​ సూకీ నిర్బంధాన్ని పొడిగిస్తూ ఆ దేశ సైనిక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా ఖండించింది. ఈ వార్త ఎంతో బాధాకరమని వ్యాఖ్యానించింది.

"మయన్మార్​లో సైనిక తిరుగుబాటు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని అధ్యక్షుడు జో బైడెన్​ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇప్పటికైనా.. ఆ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేందుకు కృషి చేయాలి. నిర్బంధించిన పౌరులు, రాజకీయ నాయకులను విడుదల చేయాలి."

--- నెడ్​ ప్రైజ్​, అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి.

మయన్మార్​ వ్యవహారాల్లో చైనా నిర్మాణాత్మక పాత్ర పోషించాలని అమెరికా భావిస్తున్నట్టు నెడ్​ స్పష్టం చేశారు. సైనిక తిరుగుబాటును వ్యతిరేకించే వరకు చైనాపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు.

మయన్మార్​లో.. ఆంగ్​ సాంగ్​ సూకీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కొద్ది రోజుల ముందు అక్కడి సైన్యం తిరుగుబాటు చేసింది. అధికారాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించింది. సూకీని నిర్బంధించింది. సోమవారంతో నిర్బంధ గడువు ముగియగా.. దానిని పొగిడిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాలకు నిరసనగా దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.

ఐరాస ఆందోళన..

మయన్మార్​లో తాజా పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి మానవహక్కుల నిపుణుడు టామ్​ ఆండ్రూస్​ ఆందోళన వ్యక్తం చేశారు. సైనికులు, నిరసనకారుల మధ్య పెద్ద ఎత్తున హింస చెలరేగే అవకాశముందన్నారు. ఫలితంగా హత్య, నిర్బంధం భారీస్థాయిలో పెరిగిపోతాయని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:-నగరంలోకి సైన్యం- పౌరుల హక్కులకు తూట్లు!

ABOUT THE AUTHOR

...view details