తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో తగ్గిన రోజువారీ కేసులు.. కానీ... - కరోనా వైరస్​ ప్రపంచం

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్​ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకు 1,14,00,035 మంది వైరస్​ బారినపడ్డారు. 5,33,874 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో రోజువారీ కేసుల సంఖ్య నాలుగు రోజుల్లో తొలిసారి 50వేలకన్నా తక్కువగా నమోదైంది. కానీ దేశ స్వతంత్ర దినోత్సవంతో వైరస్​ మరింత వేగంగా విజృంభిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

US dips under 50,000 new coronavirus cases
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలతో తప్పని వైరస్​ విజృంభణ!

By

Published : Jul 5, 2020, 4:31 PM IST

కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఇప్పటివరకు 1,14,00,035 మంది మహమ్మారి​ బారినపడ్డారు. 5,33,874 మంది వైరస్​ సోకి మృతిచెందారు.

దేశం కేసులు మరణాలు
అమెరికా 29,35,993 1,32,318
బ్రెజిల్​ 15,78,376 64,365
రష్యా 6,81,251 10,161
పెరూ 2,99,080 10,412
చిలీ 2,91,847 6,192
బ్రిటన్​ 2,84,900 44,198
మెక్సికో 2,52,165 30,366
ఇటలీ 2,41,419 34,854
ఇరాన్​ 2,37,878 11,408

కేసులు తగ్గుముఖం.. కానీ

అమెరికాలో నాలుగు రోజుల అనంతరం తొలిసారి వైరస్​ కేసులు సంఖ్య 50వేల కన్నా తక్కువ నమోదయ్యాయి. శనివారం మొత్తం 45,300 కేసులు వెలుగుచూశాయి. అయితే దీనితో సంబరపడిపోవాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. ఈ నెల 4న స్వతంత్ర దినోత్సవం దేశవ్యాప్తంగా ఘనంగా జరిగిన నేపథ్యంలో.. కేసుల సంఖ్య మరోసారి భారీ స్థాయిలో పెరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

విదేశీ కార్మికులు విలవిల..

సింగపూర్​లో ఉన్న విదేశీ కార్మికులను కరోనా వైరస్​ వదలడం లేదు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో చాలా వరకు విదేశీ కూలీలే ఉంటున్నారు. తాజాగా 136 కేసులు వెలుగుచూశాయి. బాధితుల్లో 118 మంది విదేశీ కార్మికులే.

సింగపూర్​లో 44,800 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 26 మంది ప్రాణాలు కోల్పోయారు.

వరుసగా మూడో రోజు...

దక్షిణ కొరియాలో వరుసగా మూడో రోజు 60కుపైగా నమోదయ్యాయి. తాజాగా 61మంది వైరస్​ బారినపడినట్టు అధికారుల వెల్లడించారు. వీరిలో 43 మంది స్థానికులని, మిగిలిన 18 మంది విదేశీయులను పేర్కొన్నారు. అయితే ఈ 43లో 41 మంది రాజధాని సియోల్​, గ్వాంగ్​జు, డైజియాన్​ నగరాలకు చెందినవారేనని తెలిపారు.

దక్షిణ కొరియాలో ఇప్పటివరకు 13,091 మందికి వైరస్​ సోకింది. 283 మంది మరణించారు.

చైనాలో 8కేసులు..

వైరస్​కు పుట్టినిల్లు అయిన చైనాలో కొత్తగా 8 కేసులు బయటపడ్డాయి. వీటిలో రాజధాని బీజింగ్​కు సంబంధించి రెండు కేసులున్నాయి. అయితే బీజింగ్​లో కరోనా 2.0 వ్యాప్తిని చైనా విజయవంతంగా కట్టడిచేసినట్టు కనిపిస్తోంది. వరుసగా 7వ రోజు సింగిల్​ డిజిట్​ కేసులే నమోదవడం ఇందుకు నిదర్శనం.

చైనాలో ఇప్పటివరకు 83,553 కేసులు వెలుగుచూశాయి. 4,634 మంది మరణించారు.

ఇదీ చూడండి:-కరోనా విజృంభిస్తున్నా బార్లు, రెస్టారెంట్లు రీఓపెన్

ABOUT THE AUTHOR

...view details