తెలంగాణ

telangana

ETV Bharat / international

ఎడారిలో స్పెషల్​ ఫోర్స్​.. అమెరికా తొలిసారి ఏర్పాటు!

ఇరాన్​ చేపడుతోన్న క్షిపణుల ప్రయోగం, శాటిలైట్ల హ్యాంకింగ్​, విధ్వంస కార్యక్రమాలతో అమెరికాకు కొత్త బెదిరింపులు ఎదురవుతున్నాయి. ఇరాన్​పై నిఘా వేసేందుకు అరేబియా ద్వీపకల్పంలో తొలి విదేశీ స్పేస్​ ఫోర్స్​ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది అగ్రరాజ్యం. ఖతార్​లోని 'అల్​ అయిత్​' ఎయిర్​ బేస్​ వద్ద 20 మందిని మోహరించింది. అమెరికా జాతీయ ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యమని అంతరిక్ష దళం సైనికులు చెబుతున్నారు.

US deploys Space Force to Arabian Desert
ఖతార్​లో అమెరికా స్పేస్​ ఫోర్స్​ కేంద్రం!

By

Published : Sep 21, 2020, 9:39 PM IST

భవిష్యత్తు యుద్ధాలు బాహ్య అంతరిక్షంలో జరుగుతాయి. ఎడారి దేశాల్లో ఒకటైన కువైట్​ నుంచి ఇరాకీ దళాలను తరిమికొట్టేందుకు 1991లో చేపట్టిన ఎడారి తుఫాన్​ ఆపరేషన్​ను సైనిక నిపుణులు ప్రపంచంలోని తొలి అంతరిక్ష యుద్ధంగా పిలుస్తారు. ప్రస్తుతం ఇరాన్​ క్షిపణి ప్రయోగాలు, శాటిలైట్ల హ్యాకింగ్​, విధ్వంస చర్యలతో అమెరికాకు కొత్త చిక్కులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన అమెరికా అంతరిక్ష దళం(స్పేస్​ ఫోర్స్​) బలగాలను.. అరేబియా ద్వీపకల్పంలో మోహరించింది అగ్రరాజ్యం.

తొలి విదేశీ మోహరింపులో భాగంగా.. ప్రస్తుతం ఖతార్​లోని అల్​ ఉయిద్​ ఎయిర్​ బేస్​ వద్ద 20 మంది వైమానిక బలగాలను కలిగి ఉంది నూతన అంతరిక్ష దళం. అధ్యక్షుడు డొనాల్డ్​ ఆదేశాలతో ఈ ప్రాంతంలో ఆరవ శాఖను ఏర్పాటు చేసింది. 1947లో వైమానిక దళం ఏర్పాటైన తర్వాత వచ్చిన కొత్త సైనిక సేవగా ఇది గుర్తింపు పొందింది.

"అంతరిక్షంలోకి యుద్ధాలను తీసుకెళ్లాలని దూకుడుగా ఉన్న ఇతర దేశాల కదలికను గమనించటం ప్రారంభించాం. జాతీయ ప్రయోజనాలన్నింటినీ రక్షించేందుకు పోటీ పడగలగాలి. ఈ మిషన్లు కొత్తవి కావు. "

- కల్నల్​ టాడ్​ బెన్సన్​, అల్​ ఉయిద్​ వద్ద స్పేస్​ ఫోర్స్​ డైరెక్టర్​

ఈనెల మొదట్లో అల్​ ఉయిద్​ వద్ద జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అమెరికన్​ జెండాలు, భారీ ఉపగ్రహాలతో 20 మంది వైమానిక బలగాలు.. అంతరిక్ష దళంలోకి ప్రవేశించాయి. త్వరలో ఇంకా చాలా మంది కోర్​ స్పేస్​ ఆపరేటర్లు ఈ విభాగంలో చేరనున్నారు. వారు ఉపగ్రహాలను నడపడటం, శత్రు విన్యాసాలను ట్రాక్​ చేయటం, అంతరిక్షంలో విభేదాలను నివారించటానికి ప్రయత్నిస్తారు.

తమ వైమానిక దళాలు పర్యవేక్షించే, పోరాటం చేసే దేశాల పేర్లు వెల్లడించేందుకు నిరాకరించారు బెన్సన్​. కానీ అమెరికా, ఇరాన్​ల మధ్య కొన్ని నెలలు పెరుగుతున్న ఉద్రికత్తల నేపథ్యంలో అల్ ఉయిద్​ వద్ద స్పేస్​ ఫోర్స్​ ను మోహరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

బాహ్య అంతరిక్షంలో ఆయుధీకరణపై దశాబ్దాల నాడే ఆందోళనలు వచ్చాయి. అయితే.. అంతరిక్షంపై పోటీ పెరుగుతున్నప్పుడు అమెరికన్​ ప్రయోజనాలను పరిరక్షించడానికి.. అంకితమైన అంతరిక్ష దళాల అవసరం ఉందని తెలిపారు సైనిక నిపుణులు.

కువైట్​ నుంచి ఇరాకీ నియంత సద్దాం హుస్సేన్​ బలగాలను వెళ్లగొట్టేందుకు, అమెరికా బలగాలను ఎక్కడున్నాయని తెలుసుకోవడానికి జీపీఎస్​ వ్యవస్థను తొలుత 1991లో ఉపయోగించింది అమెరికా.

ఇరాన్​ చర్యలతోనే..

ఇరాన్​ అణు ఒప్పందం నుంచి వైదొలగాలని ట్రంప్​ ఏకపక్ష నిర్ణయంతో ఇరు దేశాల మధ్య వివాదం తలెత్తింది. గత జనవరిలో ఇరానియన్​ టాప్​ కమాండర్​ జనరల్​ను అమెరికా బలగాలు మట్టుబెట్టటం వల్ల మరింత ఉద్రిక్తత తలెత్తింది. దానికి స్పందనగా.. అమెరికా సైనికులు ఉన్న ఇరాకీ ఎయిర్​ బేస్​లపై క్షిపణులతో దాడి చేసింది ఇరాన్​. తగిన సమాధానం చెబుతామని పలుమార్లు చెబుతోంది.

ఇదే కారణమా..!

కొద్దిరోజుల క్రితం ఇరాన్​ పారామిలిటరి రివల్యూషనరీ గార్డ్స్​ తమ తొలి సాటిలైట్​ను అంతరిక్షంలోకి పంపింది. దానిని రహస్య మిలిటరీ కార్యక్రమంగా నిపుణులు పేర్కొన్నారు. ఫలితంగా ఇరాన్​ స్పేస్​ ఏజెన్సీపై ట్రంప్​ ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

పెర్షియన్​ గల్ఫ్​లోని హార్ముజ్​ జలసంధి ఇటీవల వరుస ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఇటీవలే ఇరాన్​ తన నీటిలోకి ప్రవేశించినట్లు కొన్ని పడవలను స్వాధీనం చేసుకుంది. అది తప్పుడు సమాచారం లేదా, తప్పుగా అంచనా వేసి ఉండొచ్చు అనేది నిపుణులు పేర్కొంటున్నారు. చాలా ఏళ్లుగా ఇస్లామిక్​ రిపబ్లిక్​లో విదేశీ ఆధారిత ఫార్సీ మీడియా ప్రసారాలను అడ్డుకునేందుకు.. శాటిలైట్​, రేడియో సిగ్నల్స్​ను నియంత్రిస్తోంది ఇరాన్​.

పెర్షియన్​ గల్ఫ్​ మీదుగా ప్రయాణిచే వాణిజ్య విమానాల అంశంలో ఇరాన్​ జోక్యం చేసుకునే అవకాశం ఉందని అమెరికా విమానయాన సంస్థ హెచ్చరించింది. ఆ ప్రాంతంలో ఉండే ఓడలను అమెరికా, దాని మిత్ర దేశాలవిగా తప్పుగా సమాచారం ఇస్తున్నారని పేర్కొంది. మిలిటరీ బ్రాండ్​బ్యాండ్​ కమ్యూనికేషన్​లో ఇరాన్​ కలుగజేసుకునే ప్రమాదం ఉందని అమెరికా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రష్యా, చైనా కార్యక్రమాలతో ఆందోళన..

రష్యా, చైనా వంటి దేశాలు అధునాతన అంతరిక్ష కార్యక్రమాలతో దూకుడుగా ప్రవర్తిస్తున్నాయని అమెరికా అధికారులు ఆరోపిస్తున్నారు. అమెరికా ఉపగ్రహాలను పడగొట్టగల ఆయుధాలను అభివృద్ధి చేస్తున్నాయని, అంతరిక్షంలో ప్రమాదకరమైన శిథిలాలను చెదరగొట్టడం, చరవాణులు, వాతావరణ సూచనలను స్తంభింపజేయటంతో పాటు అమెరికన్​ డ్రోన్లు, యుద్ధ విమానాలు, విమాన వాహకాలను, అణ్వాయుధ కంట్రోలర్లను ధ్వంసం చేసేందుకు చూస్తున్నాయని పేర్కొన్నారు.

"సైన్యం అత్యధికంగా శాటిలైట్​ కమ్యునికేషన్​, నావిగేషన్​, గ్లోబల్​ మిసైల్​వార్నింగ్​లపై ఆధారపడుతోంది. ఇతర దేశాల ప్రాదేశిక జలాల నుంచి నౌకలు వెళ్తున్నాయా అని తెలుసుకునేందుకు జీపీఎస్​ సహకారం తీసుకుంటాయి".

- కెప్టెన్​ ర్యాన్​ వికెర్స్​, స్పేస్​ ఫోర్స్​

ఖండించిన ఇరాన్​..

తవ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటాన్ని ఇరాన్​ సహించబోదని పేర్కొన్నారు ఐక్యరాజ్యసమితిలోని ఇరాన్​ ప్రతినిధి. అంతర్జాతీయ చట్టం ప్రకారం తమ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఏవైనా దాడులు జరిగితే.. దీటుగా ప్రతిస్పందిస్తామని స్పష్టం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్​ల నుంచి పెద్ద ఎత్తు సైబర్​ దాడులను ఎదుర్కొన్నామని ఆయన ఆరోపించారు.

ఇదీ చూడండి:హైపర్ ‌సోనిక్‌ సాంకేతికతతో గగనసీమలోనూ స్వావలంబన!

ABOUT THE AUTHOR

...view details