తెలంగాణ

telangana

ETV Bharat / international

'వీలైనంత త్వరగా స్వదేశానికి వచ్చేయండి' - India corona

అమెరికన్ పౌరులకు లెవల్‌-4 అడ్వైజరీ జారీ చేసింది బైడెన్ సర్కారు. భారత్‌కు ప్రయాణాలు పెట్టుకోవద్దని తమ పౌరులకు సూచించింది. భారత్‌లో ఉన్నవారు త్వరగా తిరిగి రావాలని పేర్కొంది. భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్న వేళ అత్యవసరమైన వైద్యం అందడం క్లిష్టమని వ్యాఖ్యానించింది.

US travel advisory
అమెరికన్ పౌరులు

By

Published : Apr 29, 2021, 12:35 PM IST

కరోనా విలయం కొనసాగుతున్న వేళ.. అమెరికన్లు వీలైనంత త్వరగా భారత్‌ను విడిచి రావాలని బైడెన్ సర్కారు సూచించింది. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. అమెరికన్లు ఎవరూ భారత్‌కు ప్రయాణాలు కూడా చేయవద్దని స్పష్టం చేసింది.

భారత్‌లో కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందున.. అవసరమైన వైద్య సేవలు పరిమితంగానే అందుతాయని అమెరికా తమ పౌరులకు చెప్పింది. ఈ మేరకు లెవల్ ఫోర్‌లో పెడుతూ అడ్వైజరీ జారీ చేసింది. అత్యంత ప్రమాదం కింద ఈ లెవల్ హెచ్చరికలు అమెరికాలో జారీ చేస్తారు.

ప్రస్తుతం నేరుగా భారత్‌-అమెరికా మధ్య తిరుగుతున్న ప్రయాణికుల విమానాలు లేదా పారిస్‌, ఫ్రాంక్‌ఫుర్ట్‌ల మీదుగా నడిచే విమానసేవలనైనా వినియోగించుకొని.. వీలైనంత త్వరగా అమెరికాకు చేరుకోవాలని స్పష్టం చేస్తూ దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటన జారీ చేసింది. స్మార్ట్ ట్రావెలర్ ఎన్‌రోల్‌మెంట్ ప్రోగ్రామ్‌ను వినియోగించుకోవాలని భారత్‌లోని అమెరికన్ పౌరులకు సూచించింది.

ఇదీ చూడండి:'యుద్ధ నివారణకే ఇండో పసిఫిక్​లో అమెరికా సైన్యం'

ABOUT THE AUTHOR

...view details