అమెరికాకు చెర్రీ పూలు వసంతం తీసుకువచ్చాయి. పరిపూర్ణంగా వికసించిన ఈ దవళ వర్ణ పుష్పాలను చూడడానికి దేశ విదేశాల నుంచి సందర్శకులు వాషింగ్టన్ డీసీకి చేరుకుంటున్నారు. చెర్రీ పూల సొగసులను ప్రకృతి ప్రేమికులు తనివితీరా ఆస్వాదిస్తున్నారు.
చెర్రీ పూల సొగసు చూడతరమా? - ప్రకృతి ప్రేమికులు
వాషింగ్టన్ డీసీ జాతీయ పార్క్లో చెర్రీ పూల పండుగను చూసేందుకు దేశవిదేశాల నుంచి సందర్శకులు తరలివస్తున్నారు. ప్రకృతి రమణీయతను చూసి ఆనందిస్తున్నారు.
చెర్రీ పూల సొగసు చూడతరమా?
లేత గులాబీ, శ్వేత వర్ణాలతో శోభిల్లే ఈ చెర్రీ పుష్పాలు మరో వారం రోజుల వరకూ పూస్తూనే ఉంటాయని జాతీయ పార్క్ సిబ్బంది తెలిపారు.