అమెరికాలో కరోనాతో రోజుకు 1,600 మంది మృతి - corona virus in us
ప్రపంచవ్యాప్తంగా అంతకంతకూ విజృంభిస్తోన్న కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటివరకు అన్ని దేశాల్లో కలిపి 1.69 కోట్ల కేసులు నమోదయ్యాయి. 6.63 లక్షల మంది మృత్యువాతపడగా సుమారు కోటి మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.
అమెరికా
By
Published : Jul 29, 2020, 10:15 AM IST
ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రలయం కొనసాగుతోంది. అన్ని దేశాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. అమెరికా, బ్రెజిల్, రష్యా, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో వైరస్ ఉద్ధృతి అధికంగా ఉంది.
రోజుకు 1,600 మంది మృతి..
అగ్రరాజ్యంలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 64,729 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 44.98 లక్షల మందికి వైరస్ సోకింది. వైరస్ ధాటికి 75 రోజులుగా సగటున 1,600 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం1,52,320 మంది మరణించారు.
బ్రెజిల్లో..
అమెరికా తర్వాత బ్రెజిల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజులో 41 వేల కేసులు పెరగగా.. మొత్తం సంఖ్య 24.84 లక్షలకు చేరింది. 88,634 మంది చనిపోయారు.
స్థిరంగా పెరుగుదల..
రష్యాలో స్థిరంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 5వేల కేసులు నమోదుకాగా.. మొత్తం సంఖ్య 8.23 లక్షలకు పెరిగింది. ఇప్పటివరకు 13 వేల మరణాలు సంభవించాయి.
దక్షిణాఫ్రికా, మెక్సికో, పెరూ, చిలీ, ఇరాన్, కొలంబియాలో రోజురోజుకు మహమ్మారి తీవ్రరూపం దాల్చుతోంది. స్పెయిన్లో మళ్లీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.