US covid cases: ప్రపంచంపై కరోనా మళ్లీ పంజా విసురుతోంది. అమెరికాలో కొత్తగా 2లక్షలకుపైగా కేసులు బయటపడ్డాయి. మొత్తం మీద 24గంటల వ్యవధిలో 2,67,269మందికి కొవిడ్ సోకింది. దీంతో మొత్తం కేసు సంఖ్య 5.2కోట్లు దాటింది. 1,149 తాజా మరణాలతో మృతుల సంఖ్య 8.3లక్షలకు చేరింది.
అమెరికాలో కరోనాతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఫలితంగా ఆసుపత్రుల్లో వైద్యవ్యవస్థపై భారం పడుతోంది. ఈ క్రమంలో అక్కడి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య కార్యకర్తలకు కొవిడ్ సోకితే.. 10రోజుల పాటు పనికి దూరంగా ఉండాలని ఇప్పటివరకు ఉన్న నిబంధనను 7రోజులకు కుదించారు.
మరోవైపు కరోనా పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు. దీంతో అనేక ప్రాంతాల్లో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతోంది.
మరోవైపు న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ వద్ద న్యూఇయర్ వేడుకలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. అయితే వీక్షకుల సంఖ్యను 15వేలకు కుదించనున్నట్టు పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో టీకాలు తీసుకున్నట్టు సర్టిఫికెట్లు చూపిస్తేనే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.