అమెరికాలో కరోనా మృత్యుకేళి కొనసాగుతోంది. క్యాపిటల్ ఉదంతంతో అట్టుడుకుతున్న అగ్రరాజ్యాన్ని కరోనా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా మరో 4,300 మందికి పైగా మృతిచెందడం ఆందోళనకు గురిచేస్తోంది. జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 3,80,000లకు చేరింది. మరోవైపు, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2.2 కోట్లకు చేరుకుంది. అరిజోనా, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో ఈ వైరస్ ప్రభావం దారుణంగా కనిపిస్తోంది. రెండున్నర నెలల నుంచి అక్కడ కొవిడ్ మరణాల సంఖ్య మరింతగా పెరుగుతోంది.
రోజుకు 2.5 లక్షల కేసులు