రోజురోజుకూ కొత్తరూపు సంతరించుకుంటూ మానవాళిని అతలాకుతలం చేస్తున్న కొవిడ్ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా రోజూ వేల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారు. ఇప్పటి వరకు కేసుల సంఖ్య, మరణాల నమోదులో ముందు వరుసలో ఉన్న అమెరికాలో కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య మంగళవారానికి 6 లక్షలు దాటింది.
అమెరికాలో భారీ ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం అమలవుతుండడంతో కరోనా తీవ్రత తగ్గి మరణాల సంఖ్య గత కొన్ని నెలలుగా తగ్గుముఖం పడతున్నట్లు జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ గణాంకాలు తెలుపుతున్నాయి.
గత జనవరి నాటికి అమెరికాలో రోజూ 3000 మరణాలు సంభవించాయి. ఆదివారం 360 మంది మరణించారు. జులై నాలుగో తేదీ వరకు అమెరికాలో 60 ఏళ్లు దాటిన వారిలో 70 శాతం మందికి కనీసం వ్యాక్సిన్ ఒక డోస్ అందించినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.