అమెరికాపై కరోనా పడగ విప్పుతోంది. కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్యా అదే స్థాయిలో ఉంది. దేశంలో కేసుల సంఖ్య లక్షా 40 వేలను మించిన తరుణంలో.. మరణాల సంఖ్యను అంచనా వేశారు అమెరికా ఆరోగ్య శాఖ నిపుణుడు ఫౌచీ.
''అమెరికాలో మిలియన్ల కొద్దీ కేసులు నమోదవుతాయి. అదే స్థాయిలో మరణాల సంఖ్య లక్షను మించుతుంది. ప్రస్తుత కేసులు, ఇతర పరిస్థితుల్ని పరిశీలిస్తే.. మొత్తం లక్ష నుంచి 2 లక్షల మధ్య మరణాలు సంభవించే అవకాశముంది.''