ప్రపంచదేశాలను వణికిస్తోన్న మహమ్మారి కరోనా అమెరికాపై పంజా విసురుతోంది. ప్రధానంగా న్యూయార్క్లో గురువారం 799 మంది మృతి చెందారు. వరుసగా మూడోరోజు అత్యధిక మరణాలు సంభవించినట్లు రాష్ట్ర గవర్నర్ తెలిపారు. అయితే ఐసీయూ, ఇంక్యుబేషన్లో చేరుతున్న వారి సంఖ్య తగ్గినట్లు పేర్కొన్నారు.
అమెరికాలో కరోనా మరణమృదంగం- 15వేలు దాటిన మృతులు - NEW YORK CORONA NEWS
అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రధానంగా న్యూయార్క్లో గురువారం 799 మంది వైరస్ కారణంగా బలయ్యారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 15 వేలమంది ప్రాణాలు కోల్పోయారు.

అమెరికాలో కరోనా మరణమృదంగం- 15వేలు దాటిన మృతులు
న్యూయార్క్లో ఇప్పటివరకు 7వేల మందికి పైగా మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో గురువారం నాటికి మొత్తం మృతుల సంఖ్య 15,774కు చేరింది. కరోనా సోకిన వారి సంఖ్య 4 లక్షల 50 వేలు దాటింది.