తెలంగాణ

telangana

ETV Bharat / international

భారతీయుల కలల బిల్లుకు ఆమోదం నేడే!

గ్రీన్​కార్డు ఇచ్చే ప్రక్రియలో దేశాల వారీ కోటాను తొలగించే బిల్లు నేడు అమెరికా కాంగ్రెస్​ సభకు రానుంది. నైపుణ్యం ఉన్న వారికే అవకాశం కల్పించేందుకు ట్రంప్​ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

గ్రీన్​కార్డు

By

Published : Jul 9, 2019, 11:39 AM IST

Updated : Jul 9, 2019, 2:02 PM IST

అమెరికా కాంగ్రెస్​కు గ్రీన్​కార్డు బిల్లు

అమెరికా కాంగ్రెస్​ సభలో మరో కీలక బిల్లుపై నేడు ఓటింగ్ జరగనుంది. గ్రీన్​కార్డు వితరణలో దేశాల వారీ కోటాను తొలగించాలన్న బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. కోటా విధానం మార్చి... నైపుణ్యం ఉన్నవారికే పౌరసత్వ కల్పించాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది.

435 మంది సభ్యులున్న అమెరికా ప్రతినిధుల సభలో 310 మందికి పైగా సభ్యులు ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నారు. ఇందులో 203 మంది డెమొక్రాట్లు, 108 మంది రిపబ్లికన్లు ఉన్నారు. కాంగ్రెస్​లో ఎలాంటి అభ్యంతరాలు, సవరణలు లేకుండా బిల్లు ఆమోదం పొందడానికి 290 మెజారిటీ ఉంటే సరిపోతుంది. ఫలితంగా బిల్లు నెగ్గటం ఖాయంగానే కనిపిస్తుంది. ఈ బిల్లును 'హెచ్ఆర్​​-1044'గా పిలుస్తున్నారు.

భారతీయులకు ప్రయోజనం

ఈ బిల్లుతో గ్రీన్​కార్డు కోసం దశాబ్దకాలంగా ఎదురుచూస్తున్న అనేక భారతీయులకు లబ్ధి చేకూరనుంది. దేశాలవారీ కోటాను తీసేస్తే హెచ్​-1బీ వీసా ద్వారా వెళ్లే భారతీయులకు పౌరసత్వం త్వరగా లభిస్తుంది.

ఇటీవల కొన్ని నివేదికల ప్రకారం హెచ్​-1బీ వీసాపై వచ్చిన భారత ఐటీ నిపుణులకు గ్రీన్​కార్డు పొందాలంటే కనీసంగా 70 ఏళ్ల పడుతుంది.

బిల్లులోని మరిన్ని అంశాలు

  • కుటుంబ ఆధారిత వీసాలకు దేశాలవారీ కోటా 7 నుంచి 15 శాతానికి పెంపు
  • ఉపాధి ఆధారిత వీసాలకు 7 శాతం కోటా తొలగింపు.
  • వీసా అనుమతికి ఉన్నత చదువు, అసాధారణమైన సామర్థ్యం, నైపుణ్యం, పెట్టుబడిదారులకు ప్రాధాన్యం.
  • ఒక దేశానికి 85 శాతానికి మించి వీసా జారీ కుదరదు.

దిగువ సభ ఆమోదం తర్వాత సెనేట్​కు ఓటింగ్​కు వెళుతుంది. అక్కడ ఆమోదం లభిస్తే అమెరికా అధ్యక్షుడి సంతకంతో చట్టంగా రూపొందుతుంది.

ఇదీ చూడండి: భారతీయులకు మరింత సులభంగా గ్రీన్​కార్డ్​!

Last Updated : Jul 9, 2019, 2:02 PM IST

ABOUT THE AUTHOR

...view details