అఫ్గానిస్థాన్ నుంచి ముందుగా నిర్ణయించిన గడువులోపే తమ బలగాలను ఉపసంహరించుకుంది అమెరికా(america evacuation). గడువులోపు పూర్తిస్థాయిలో తమ దేశ పౌరులను తరలించలేకపోయింది. అయితే.. అఫ్గాన్‌లో చిక్కుకుపోయిన తమ పౌరుల తరలింపు కోసం కొత్త స్కేచ్ వేసినట్లు తెలుస్తోంది. తాజాగా నలుగురు తమ దేశ పౌరులను భూమార్గం ద్వారా మూడో దేశానికి సురక్షితంగా పంపించినట్లు అమెరికా వెల్లడించింది. ఆగస్టు 31 తర్వాత అఫ్గాన్ నుంచి తరలించిన తొలి బృందంగా అగ్రరాజ్య విదేశాంగ శాఖ పేర్కొంది.
"అఫ్గాన్ సరిహద్దు దాటి మూడో దేశానికి సురక్షితంగా వెళ్లిన తమ పౌరులకు మా ఎంబసీ శుభాకాంక్షలు తెలిపింది" అని విదేశాంగ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నట్లు సీఎన్ఎన్ మీడియా వెల్లడించింది. అయితే.. అమెరికా పౌరులను తరలించిన ఆ మూడో దేశం వివరాలను అధికారులు బయటపెట్టలేదని తెలిపింది.
మరోవైపు.. అఫ్గాన్ నుంచి భూమార్గం ద్వారా సరిహద్దు దాటేందుకు అతిదగ్గరగా ఉన్న దేశం పాకిస్థానేనని తన కథనంలో పేర్కొంది డాన్ న్యూస్‌పేపర్. 'వాళ్లు ఏ మార్గాన్ని ఉపయోగించారనేది మాకు తెలియదు. కానీ, అఫ్గాన్ నుంచి అమెరికా పౌరులను తరలించేందుకు మాకు ఎలాంటి సమస్య లేదు. అఫ్గాన్ నుంచి పౌరుల తరలింపునకు పాకిస్థాన్ అన్ని విధాలుగా మద్దతుగా నిలుస్తుంది. పాకిస్థాన్ మీదగా ఇప్పటి వరకు 9వేల మందిని తరలించారు. ఈ విషయంలో ఇప్పటికీ అంతర్జాతీయ సమాజానికి పాక్ మద్దతుగా నిలుస్తోంది.' అని అమెరికాలోని పాక్ రాయబారి డాక్టర్ అసద్ మజీద్ ఖాన్ డాన్ పత్రికకు తెలిపారు.
తాలిబన్లతో చర్చలు..
మరోవైపు... అఫ్గానిస్థాన్‌ను వీడాలనుకుంటున్న వారిని తరలించేందుకు కాబుల్‌కు ప్రత్యేక ఛార్టర్డ్ ఫ్లైట్స్ నడిపేందుకు తాలిబన్లతో(Afghan Taliban) చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్. సరైన పత్రాలు ఉండి దేశాన్ని వీడాలనుకుంటున్న వారిని సురక్షితంగా తరలించేందుకు తాలిబన్లు భరోసా కల్పించారని గుర్తు చేశారు. ఆ మాటకు తాలిబన్లు కట్టుబడి ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. అఫ్గాన్‌లో మరో 100 మంది వరకు అమెరికా పౌరులు ఉంటారని అంచనా వేశారు.
అంతకు ముందు విదేశాంగ శాఖ అంచనా ప్రకారం 100-200 మంది ఇంకా అఫ్గాన్‌లో ఉన్నారు. ప్రస్తుతం యూఎస్ విదేశాంగ శాఖ మంత్రి బ్లింకెన్, రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఖతార్ పర్యటనలో ఉన్నారు.
వారికి తాలిబన్ల అనుమతి..