జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద చర్యలను, చొరబాట్లను తీవ్రంగా ఖండిస్తున్నట్లు అమెరికా విదేశాంగ ప్రతినిధి నెడ్ ప్రైస్ స్పష్టం చేశారు. భారత్-పాక్‌ల మధ్య ప్రత్యక్ష చర్చలకు మద్దతిస్తున్నట్లు తెలిపారు.
జమ్ముకశ్మీర్‌లో జరుగుతున్న పరిణామాలను చాలా దగ్గరగా గమనిస్తున్నాం. ఈ ప్రాంతం పట్ల అమెరికా విధానంలో మార్పులేదు. 2003 కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్ కట్టుబడి ఉండాలి. తద్వారా నియంత్రణ రేఖ వెంట ఉద్రిక్తతలను తగ్గించాలి.