తెలంగాణ

telangana

ETV Bharat / international

'అందుకే ఆ దేశాలకు చైనా, రష్యాల నుంచి టీకాలు' - రష్యా, చైనా వ్యాక్సినేషన్​

టీకాల పంపిణీ విషయంలో చైనా, రష్యాలు అనుసరిస్తున్న తీరుపై అమెరికా మండిపడింది. ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని పలు దేశాలకు వ్యాక్సిన్​ అందించేది.. వాటిపై ఆధిపత్యం చేలాయించేందుకేనని శ్వేత సౌధం ప్రెస్​ సెక్రటరీ జెన్​ సాఖి పరోక్షంగా ఆరోపించారు. సొంత దేశాల్లో మానవహక్కుల ఉల్లంఘనలను ఎవరూ ప్రశ్నించకూడదనే చైనా, రష్యాలు ఇలా చేస్తున్నాయన్నారు.

US 'concerned' by Russia, China using vaccines to engage with countries
ఆ దేశాలకు చైనా, రష్యాల వ్యాక్సిన్​లు.. కారణం ఇదే

By

Published : Mar 3, 2021, 2:48 PM IST

ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని దేశాలపై ఆధిపత్యం చెలాయించేందుకే ఆయా దేశాలకు చైనా, రష్యాలు కరోనా వ్యాక్సిన్​లు అందిస్తున్నాయని పరోక్షంగా ఆరోపించారు శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ జెన్​ సాఖి. చైనా, రష్యా దేశాల్లో మానవహక్కులు, భావప్రకటనా స్వేచ్ఛ, మతస్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛలకు విఘాతాలపై ప్రశ్నించకుండా ఉండేందుకే ఇరు దేశాలు ఈ చర్యలకు పాల్పడుతున్నాయన్నారు.

టీకాల పంపిణీ విషయంలో చైనా, రష్యా దూసుకెళ్తుంటే.. అమెరికా మాత్రం చివర్లో ఉందన్న మీడియా ప్రశ్నకు సాఖి వివరణ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దృష్టి మొత్తం అమెరికా ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించటంపైనే ఉందన్నారు సాఖి. తమ ప్రాథమిక కర్తవ్యం అదే అని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి :'మే చివరినాటికి వయోజనులందరికీ కరోనా టీకా'

ABOUT THE AUTHOR

...view details