తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​పై డబ్ల్యూటీఓకు అమెరికా ఫిర్యాదు - డబ్ల్యూటీఓలో భారత్​పై అమెరికా ఫిర్యాదు

ఆహార దిగుమతుల విషయంలో భారత్ ఇటీవల తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై ప్రపంచ వాణిజ్య సంస్థను ఆశ్రయించింది అమెరికా. 'జన్యు మార్పిడివి కాదు' అన్న ధ్రువీకరణ పత్రం సమర్పించాలన్న నిబంధనపై అభ్యంతరం తెలిపింది. ఇది ఎగుమతి చేసే దేశాలపై అనవసర భారం మోపుతుందని ఆరోపించింది.

us india
భారత్ అమెరికా

By

Published : Nov 26, 2020, 6:46 AM IST

విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆహార పదార్థాలకు 'జన్యు మార్పిడివి కాదు' అన్న ధ్రువీకరణ పత్రం సమర్పించాలన్న భారత్ నిర్ణయంపై అమెరికా అభ్యంతరం తెలిపింది. దీనిపై ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)కు ఫిర్యాదు చేసింది.

ధ్రువీకరణ సమర్పణను రానున్న జనవరి ఒకటో తేదీ నుంచి తప్పనిసరి చేస్తూ భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆదేశాలు ఇచ్చింది. గోధుమలు, బియ్యం, బంగాళదుంపలు, టమాటా సహా 24 పంటలకు దీన్ని వర్తింపజేస్తూ ఆగస్టు నెలలో ఉత్తర్వులు జారీ చేసింది.

మానవ వినియోగానికి మాత్రమే..

ఎగుమతి చేసే దేశాలపై ఇది అనవసర భారం మోపుతుందని అమెరికా ఆరోపించింది. సాంకేతికంగా సంప్రదాయ పంటలకు, జన్యు మార్పిడి పంటలకు మధ్య ఎలాంటి తేడాలు లేవని, కానీ భారత్ ఇవి సురక్షితమైనవి కావంటోందని తెలిపింది.

దీనిపై భారత్ వివరణ ఇస్తూ మానవ వినియోగం కోసం ఉపయోగించే జన్యుమార్పిడి పంటలను వద్దంటున్నామే తప్ప, ఇతర అవసరాల కోసం ఉపయోగించే వాటిని కాదని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:ఆహార పదార్థాలతో కరోనా ? చైనా సరికొత్త వాదన

ABOUT THE AUTHOR

...view details