తెలంగాణ

telangana

ETV Bharat / international

Vaccine lottery: మహిళకు రూ. 7.45 కోట్ల జాక్​పాట్​! - Heidi Russell

అమెరికా కొలరాడో రాష్ట్రానికి చెందిన ఓ మహిళకు జాక్​పాట్ తగిలింది. వ్యాక్సిన్​ లాటరీలో(Vaccine lottery) 1 మిలియన్​ డాలర్లు ( సుమారు రూ.7.45కోట్లు) గెలుచుకుంది. ​

Vaccine lottery
వ్యాక్సిన్​ లాటరీ విన్నర్​

By

Published : Jul 8, 2021, 1:34 PM IST

అమెరికా కొలరాడో రాష్ట్రానికి చెందిన ఓ మహిళను అదృష్టం వరించింది. వ్యాక్సినేషన్​ను ప్రోత్సాహించేందుకు ఆ రాష్ట్ర సర్కారు ప్రవేశపెట్టిన లాటరీలో హైడీ రెస్సెల్​ను విజేతగా ప్రకటించారు ఆ రాష్ట్ర గవర్నర్​ జార్డ్​ పోలీస్​. దాని ద్వారా 1 మిలియన్​ డాలర్లు (సుమారు రూ.7.45కోట్లు) గెలుచుకుంది.

లాటరీ విజేతగా నిలిచిన హైడీ రస్సెల్​
లాటరీ చెక్​

ఈ విషయం తెలియగానే తను ఆశ్చర్యానికి గురైనట్లు పేర్కొంది హైడీ. ఒక రోజంతా నమ్మలేకపోయాయని తెలిపింది.

లాటరీ విన్నర్​ను ప్రకటిస్తున్న గవర్నర్​

అమెరికాలో టీకా తీసుకునేలా.. ప్రజలను ప్రోత్సహించడానికి ఆకర్షణీయమైన పథకాలను ప్రవేశపెట్టింది కొలరాడో రాష్ట్ర సర్కారు. దీనిలో భాగంగా టీకా తీసుకునే అదృష్టవంతులకు ప్రతి వారం 1 మిలియన్‌ డాలర్లు (రూ.7.45కోట్లు) బహుమానంగా ఇస్తామని ప్రకటించింది.

అయితే లాటరీ పథకంతో టీకాలు తీసుకున్నవారి సంఖ్య పెరగలేదని డాటా ఆధారంగా తెలుస్తోంది. రాష్ట్రంలో మే 26 నుంచి జూన్​ 26 వరకు ఐదు లక్షలకు పైగా టీకా అందించారు. లాటరీ ప్రకటించిన ముందు నెల కంటే టీకాలు తీసుకున్న వారి సంఖ్య 43 శాతం తగ్గిపోయినట్లు తెలుస్తోంది.

17ఏళ్ల లోపు వారికి మాత్రం మరో ప్రత్యేకమైన లాటరీని ప్రకటించారు. ఇందులో విజేతలకు డబ్బులు ఇవ్వరు.. ఏడాది పాటు స్కూల్‌ స్కాలర్‌షిప్‌ను ఇవ్వనున్నారు. వాస్తవానికి ఈ రాష్ట్రంలో విద్య అత్యంత ఖరీదైన వ్యవహారం.

ఇదీ చూడండి:అమెరికాలో కరోనా 'డెల్టా' విజృంభణ- చిన్నారుల్లోనూ...

ABOUT THE AUTHOR

...view details