తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రేడ్​ వార్​కు చెక్​.. వాణిజ్య ఒప్పందానికి అంగీకారం - జాతీయ వార్తలు తెలుగులో

18 నెలల పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిన.. వాణిజ్య యుద్ధం ముగిసింది. రెండు ప్రపంచ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనాల మధ్య తొలి దశ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరిందని ప్రకటించారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.

us-china-reach-phase-one-trade-deal-president-trump
ట్రేడ్​ వార్​కు చెక్​.. వాణిజ్య ఒప్పందానికి అంగీకారం

By

Published : Dec 14, 2019, 5:26 AM IST

Updated : Dec 14, 2019, 10:02 AM IST

ట్రేడ్​ వార్​కు చెక్​.. వాణిజ్య ఒప్పందానికి అంగీకారం

అమెరికా, చైనా మధ్య మొదటి దశ వాణిజ్య ఒప్పందం ఓ కొలిక్కి వచ్చింది. ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరిందని చైనా వాణిజ్య పన్నుల శాఖ సహాయ మంత్రి వాంగ్‌ షౌవెన్‌ ప్రకటించారు. ఇరు దేశాలు ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉందన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ కూడా ఈ అంశంపై​ ట్విట్టర్​ వేదికగా స్పందించారు. మొదటి దశలో భాగంగా చైనాతో పలు ఆర్థిక, వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకు అంగీకరించామని, గతంలో చర్చకు వచ్చిన అనేక అంశాల్లో వ్యవస్థాగతంగా పలు మార్పులు చేసేందుకు చైనా అంగీకరించిందని తెలిపారు.

''చైనాతో తొలి దశ వాణిజ్య ఒప్పందాన్ని మేం అంగీకరించాం. వారు ఎన్నో వ్యవస్థాగత మార్పులకు అంగీకరించారు. ముఖ్యంగా... వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లకు అంగీకరించారు.''

- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

250 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై గతంలో విధించిన 25 శాతం సుంకాల విషయంలో స్టే విధిస్తున్నామని, త్వరలో రెండో దశ ఒప్పందంపై చర్చలు చేపడతామని పేర్కొన్నారు ట్రంప్​. ఈ వారాంతంలో మరో 160 బిలియన్‌ డాలర్ల చైనా ఉత్పత్తులపై సుంకాలు విధించేందుకు సిద్ధమైన అమెరికా ఈ చర్చల నేపథ్యంలో వెనక్కి తగ్గింది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం...

రెండు దేశాల మధ్య గత కొంతకాలంగా వాణిజ్య యుద్ధం ఆందోళన రేకెత్తించింది. తొలుత చైనాకు చెందిన 250 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై అమెరికా సుంకాలు విధించగా.. ప్రతిగా చైనా సైతం 110 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై సుంకాలు పెంచింది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలైంది. దీనిపై ఐఎంఎఫ్‌ ఆందోళన వ్యక్తంచేసింది. రెండు దేశాల వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమయ్యాయి.

Last Updated : Dec 14, 2019, 10:02 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details