తెలంగాణ

telangana

ETV Bharat / international

'హెచ్-​1బీ వీసాల జారీ రెట్టింపు చేయండి' - యూఎస్​ ఛాంబర్స్​ ఆఫ్​ కామర్స్

హెచ్​-1బీ వీసాలను రెట్టింపు చేయాలని అమెరికా ప్రభుత్వానికి యూఎస్​ ఛాంబర్స్​ ఆఫ్​ కామర్స్ తెలిపింది. అమెరికాలో నైపుణ్య ఉద్యోగుల కొరత ఎక్కువగా ఉందని.. అందుకోసం వీసాల జారీని పెంచాలని కోరింది.

H-1B
హెచ్​1బీ వీసా

By

Published : Jun 22, 2021, 11:06 AM IST

అమెరికాలో నైపుణ్య ఉద్యోగుల కొరతను దృష్టిలో ఉంచుకుని హెచ్-​1బీ వీసాల జారీని రెట్టింపు చేయాలని యూఎస్​ ఛాంబర్స్​ ఆఫ్​ కామర్స్​.. జో బైడెన్​ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.

గ్రీన్​ కార్డు జారీ కోసం ప్రవాసీయులు ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వస్తోందని.. దాని వల్ల ఉద్యోగుల కొరత తీవ్రమవుతుందని తెలిపింది. అందువల్ల ఆ విధానాన్ని రద్దు చేయాలని కోరింది. గ్రీన్​ కార్డు కోటా కింద కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని ఇచ్చే హెచ్​-1బీ వీసా విధానాన్ని రద్దు చేసి, ఒక్కొక్కరికి ఇచ్చేలా మార్పులు చేయాలని సూచించింది. దాంతో ప్రస్తుతం 65,000 వీసాల జారీని రెట్టింపు చేయవచ్చని తెలిపింది. ఇంకా ఇమిగ్రేషన్​ చట్టాల్లో మార్పులు చేయాలని కోరింది.

ఇదీ చదవండి:H1B: వారికి ఊరట- ట్రంప్​ పాలసీకి స్వస్తి!

ABOUT THE AUTHOR

...view details