మాస్కులు ధరించడంపై అమెరికన్లకు ఆ దేశ వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ) నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. కొవిడ్-19 రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కరోనాతో నాడు అత్యంత దారుణంగా ప్రభావితమైన అమెరికా.. సాధారణ పరిస్థితులవైపు శరవేగంగా అడుగులు వేస్తోందనడానికి ఇదే నిదర్శనం.
నూతన మార్గదర్శకాలు ఇలా..
- ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్స్, ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న వారికే ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి.
- వ్యాక్సిన్ తీసుకోకపోయినా, పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ పొందక పోయినా మాస్కు ధరించాల్సిందే.
- టీకా రెండో డోసు తీసుకున్న రెండు వారాల తర్వాత మాస్కులు తీసేయవచ్చు.
- రాష్ట్రాలు నిబంధనలు విధిస్తే వాటిని పాటించాలి. నిబంధనలు లేకపోతే భౌతిక దూరం కూడా అవసరం లేదు.
- ప్రయాణాలకు ముందు, ఆ తర్వాత కొవిడ్ పరీక్షలు చేయించుకోనవసరం లేదు.
- ప్రయాణం తర్వాత క్వారంటైన్, హోంక్వారంటైన్ అవ్వాల్సిన అవసరం లేదు.
బైడెన్ హర్షం..