భృూణహత్యకు పాల్పడిన కేసులో అమెరికా ప్రభుత్వం మాంటగోమేరి అనే మహిళకు మరణశిక్షను అమలు చేసింది. 1953 తరువాత అమెరికాలో మరణ శిక్షను విధించడం ఇదే తొలిసారి. ఆమెకు బుధవారం ఉదయం ఇండియానాలోని టెర్రె హట్లోని ఫెడరల్ జైలులో ఇంజెక్షన్ ఇచ్చి శిక్షను అమలు చేశారు. అమెరికాలో 17 ఏళ్లుగా లేని మరణ శిక్షలను ట్రంప్ సర్కార్ తిరిగి ప్రవేశపెట్టింది.
మరణశిక్షపైమేరి న్యాయవాది కెల్లీ హెన్రీ మండిపట్టారు. పరిపాలనలో విఫలం అయితే ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటారని అన్నారు. ఈ శిక్షను అమలు చేయడంలో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరూ సిగ్గుపడాలి అని అన్నారు.