తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్​ మద్దతుదారుల ఆందోళన హింసాత్మకం - అమెరికా నిరసనల్లో ఉద్రిక్తత

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్​ విజయాన్ని ఆ దేశ కాంగ్రెస్​ అధికారికంగా ధ్రువీకరించేందుకు సమావేశమైన క్రమంలో.. క్యాపిటోల్​​ భవనం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమావేశాన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్​ మద్దతుదారులు చేపట్టిన నిరసన హింసకు దారితీసింది. పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కాల్పులు జరపగా.. ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.

US Capitol locked down as Trump supporters clash with police; security breach reported
ట్రంప్​ మద్దతుదారుల ఆందోళన హింసాత్మకం

By

Published : Jan 7, 2021, 2:53 AM IST

Updated : Jan 7, 2021, 6:35 AM IST

అమెరికా అధ్యక్ష పదవి నుంచి డొనాల్డ్​ ట్రంప్​ మరో రెండు వారాల్లో వైదొలగనున్న తరుణంలో వాషింగ్టన్​లో ఆయన మద్దతుదారులు భారీ ఆందోళన చేపట్టారు. ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డెమొక్రాట్​ అభ్యర్థి జో బైడెన్ ఎన్నికను అధికారికంగా ధ్రువీకరించేందుకు అమెరికన్​ కాంగ్రెస్ భేటీ అయింది. అయితే.. ఈ సమావేశాన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్​ మద్దతుదారులు క్యాపిటోల్​​ భవనం వద్ద చేపట్టిన నిరసన హింసకు దారితీసింది. వారిని అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించగా.. ఘర్షణకు దిగారు నిరసనకారులు. బారికేడ్లను నెట్టివేశారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు.. తొలుత పెప్పర్​ స్ప్రేలను ప్రయోగించారు.

పోలీసులు, ఆందోళనకారుల మధ్య బాహాబాహీ..
బారికేడ్లను తోసేస్తున్న నిరసనకారులు

మూతపడిన క్యాపిటోల్​​ భవనం..

అయితే.. పరిస్థితిని అదుపులోకి రాకపోవడం వల్ల పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడగా.. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరికొందరికీ స్వల్ప గాయాలైనట్టు సమాచారం. ఘర్షణల నేపథ్యంలో చట్టసభల సభ్యులు లోపల ఉండగానే క్యాపిటోల్​ భవనాన్ని మూసివేశారు. బయటివారు లోపలకు, లోపలవారు బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. పరిస్థితి అదుపు తప్పకుండా అదనపు బలగాలను మోహరించారు.

పెప్పర్​స్ప్రే ప్రయోగం
కాల్పులు జరుపుతున్న పోలీసులు

ఘర్షణలపై స్పందించిన అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. అంతా శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రిపబ్లికన్​ పార్టీ అంటే శాంతి భద్రతలను కాపాడే పార్టీ అని గుర్తు చేశారు. అయితే.. తన మద్దతుదారులు తక్షణమే క్యాపిటోల్​​ భవనం వదిలి వెళ్లేలా చేయాలని.. అగ్రరాజ్య ప్రతినిధుల సభ స్పీకర్​ నాన్సీ పెలోసీ ట్రంప్​ను కోరారు.

ఇదీ చదవండి:యూఎస్​ కాంగ్రెస్​ వద్ద తుపాకుల మోత

Last Updated : Jan 7, 2021, 6:35 AM IST

ABOUT THE AUTHOR

...view details