US Capitol Attack: డొనాల్డ్ ట్రంప్ ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఆయన అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో బైడెన్ మాట్లాడారు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమిని అంగీకరించకుండా హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని బైడెన్ ఆరోపించారు.
'అధికారమార్పిడి హింసాత్మకం చేసిన ఏకైక అధ్యక్షుడు ట్రంప్'
US Capitol Attack: అమెరికా చరిత్రలో అధికారమార్పిడి శాంతియుతంగా జరగకుండా చేసిన ఏకైక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అని విమర్శించారు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్. ట్రంప్ చర్యలు ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు.
జో బెైడెన్
అమెరికా చరిత్రలో అధికారమార్పిడి శాంతియుతంగా జరగకుండా చేసిన ఏకైక అధ్యక్షుడు ట్రంప్ అని విమర్శించారు. పోలీసులపై దాడి చేయించడం, స్పీకర్‌ను బెదిరించడం వంటి చర్యలకు పాల్పడ్డారన్న బైడెన్.. ట్రంప్ చర్యలను ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. అయినప్పటికీ వారిపై ప్రజాస్వామ్యమే విజయం సాధించిందన్నారు. ప్రజాస్వామ్యంపై దాడి జరిగిన ఆ చీకటి రోజును ప్రజలంతా గుర్తుంచుకోవాలని బైడెన్ తెలిపారు.
ఇదీ చూడండి :పెట్రో ధరల పెంపుపై నిరసనల్లో హింస- పదుల సంఖ్యలో మృతి