తెలంగాణ

telangana

ETV Bharat / international

భారతీయ ఐటీ నిపుణుల వీసా ప్రాసెసింగ్​కు లైన్ క్లియర్! - అమెరికా వీసా నిలిపివేత

కరోనా నేపథ్యంలో ప్రయాణాలపై ఆంక్షలు ఉన్నా.. వీసా ప్రాసెస్(US visa travel ban update)​ ఆపకూడదని అమెరికా ఫెడరల్​ కోర్టు స్పష్టం చేసింది. సాంకేతిక నిపుణులు సహా అర్హత ఉన్న ప్రయాణికులకు వీసాల జారీని నిలిపివేయడం చట్టవిరుద్ధమని పేర్కొంది.

us visa travel ban update
అమెరికా వీసాలు నిలిపివేత

By

Published : Oct 7, 2021, 4:16 PM IST

కొవిడ్​ నివారణ కోసం విధించిన ప్రయాణ ఆంక్షలు ఉన్నా వీసాలను(us visa travel ban update) ప్రాసెస్ చేయడం​ ఆపకూడదని అమెరికా ఫెడరల్​ న్యాయస్థానం స్పష్టం చేసింది. భారత్​కు నుంచి వచ్చే సాంకేతిక నిపుణులు(US visa ban india) సహా అర్హత ఉన్న ప్రయాణికులకు వీసాల జారీని నిలిపివేయడం చట్టవిరుద్ధమని కోర్టు వ్యాఖ్యానించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

కొవిడ్​ నేపథ్యంలో వీసాలు(us visa ban update) జారీ చేసేందుకు అమెరికా విదేశాంగ శాఖ నిరాకరించడంపై అమెరికన్​ ఇమ్మిగ్రేషన్​ లాయర్స్​ అసోసియేషన్​​(ఏఐఎల్ఏ) సాయంతో కొందరు వ్యక్తులు, ఇమ్మిగ్రేషన్​ లా సంస్థల కూటమి దాఖలు చేసిన పిటిషన్​పై ఫెడరల్​ కోర్టు విచారణ జరిపింది.

కరోనా వ్యాప్తి నివారణకు ప్రయాణాలపై ఆంక్షలు విధించారు అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు జో బైడెన్​ వాటిని కొనసాగిస్తున్నారు. అయితే ఆ నిబంధనల సాకుతో వీసాల జారీ నిలిపేయడం చట్టవిరుద్ధమని కోర్టు వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

అమెరికా విధించిన ప్రయాణ ఆంక్షల వల్ల సైన్స్​, టెక్నాలజీ, ఇంజనీరింగ్​, మ్యాథ్స్​(ఎస్​టీఈఎం) రంగాలకు చెందిన అమెరికన్ కంపెనీల ఉద్యోగులు తీవ్రంగా ప్రభావితమయ్యారు. మరోవైపు వీసా జారీ నిలిపివేయడం వల్ల స్వదేశాలకు వెళ్లిన ఐటీ నిపుణులు సహా పలువురు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇదీ చూడండి:'బాధిత దేశం ముసుగులో ఉగ్రవాదానికి పాకిస్థాన్​ మద్దతు'

ABOUT THE AUTHOR

...view details