హాంకాంగ్ స్వయంప్రతిపత్తిని హరించే చైనా జాతీయ భద్రతా చట్టంపై చర్చించేందుకు ఐక్యరాజ్య సమితి(ఐరాస) భద్రతా మండలి సమావేశం కావాలని అమెరికా పిలుపునిచ్చింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా హాంకాంగ్‌లో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ చట్టంపై సభ్య దేశాలు చర్చించాల్సిన అవసరం ఉందని అమెరికా స్పష్టం చేసింది.
విరుద్ధం..
హాంకాంగ్‌లో వేర్పాటు వాదం, విధ్వంసం, విదేశీ జోక్యాన్ని నిషేధిస్తూ చైనా ప్రభుత్వం ఆ దేశ పార్లమెంట్‌లో ఈ నెల 22న జాతీయ భద్రతా బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ హాంకాంగ్‌లోని ప్రజాస్వామ్య అనుకూల వాదులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. 1997 నాటి బ్రిటిష్ ఒప్పందానికి ఈ బిల్లు విరుద్ధమని నినదించారు.