ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే కోటిన్నర మందికి సోకిన ఈ వైరస్ 6 లక్షల 30 వేల మంది ప్రాణాలు తీసుకుంది. ప్రపంచంలోనే అత్యధిక కొవిడ్ కేసులు నమోదతున్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్, భారత్ తొలిమూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ దేశాల్లో నిత్యం దాదాపు 50వేల పాజిటివ్ కేసుల చొప్పున బయటపడుతున్నాయి. అయితే, కొవిడ్-19 తీవ్రత ఎక్కువగా ఉన్న ఈ మూడు దేశాలకు వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం ఉందని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది.
శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా, బ్రెజిల్, భారత్‌కు ఈ మహమ్మారిని ఎదుర్కొనే అత్యంత అంతర్గత సామర్థ్యాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర విభాగాధిపతి మైక్ రేయాన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ దేశాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ వీటిని దీటుగా ఎదుర్కొంటాయని అభిప్రాయపడ్డారు.
అమెరికాలో గంటకు 2600 కేసులు..