దాదాపు 70 ఉగ్రవాద సంస్థలకు చెందిన 6.3కోట్ల డాలర్ల(రూ. 460కోట్లు) నిధులకు 2019లో అమెరికా అడ్డుకట్ట వేసింది. అత్యధికంగా అల్‌ఖైదా సంస్థ నిధులను 39లక్షల డాలర్లు(రూ. 28.5కోట్లు) అడ్డుకుంది. పాకిస్థాన్‌కి చెందిన ఉగ్రవాద సంస్థలు.. లష్కరే తొయిబావి 3.4లక్షల డాలర్లు(రూ. 2.4కోట్లు), జైషే మహమ్మద్ 1,725డాలర్లు(రూ. 1.2లక్షలు), హర్కత్-అల్-ముజాహిదీన్-అల్ ఇస్లామి 45,798డాలర్లు(రూ. 33లక్షలు) నిధులు వీటిలో ఉన్నాయి. అమెరికా ఆర్థికశాఖ విడుదల చేసిన వార్షిక నివేదిక ఈ విషయాలను వెల్లడించింది.
రూ. 460కోట్ల ఉగ్రవాద నిధులకు అమెరికా అడ్డుకట్ట
2019లో రూ. 430కోట్ల నిధులను ఉగ్రవాద సంస్థలకు చేరకుండా అడ్డుకట్ట వేసినట్టు అమెరికా ఆర్థికశాఖ ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో అత్యధికంగా రూ. 28.5 కోట్లు లష్కరే తొయిబాకు చెందినవిగా పేర్కొంది.
రూ. 460కోట్ల ఉగ్రవాద నిధులకు అమెరికా అడ్డుకట్ట
విదేశీ ఉగ్రవాద సంస్థలను అణచివేయడంలో భాగంగా గుర్తింపు పొందిన ఉగ్రవాద సంస్థల నిధులను నిరోధించినట్లు నివేదిక తెలిపింది. నివేదిక ప్రకారం.. తాలిబన్ల నిధులు 59,065డాలర్లు(రూ. 43లక్షలు), పాక్ ఆక్రమిత కశ్మీర్ కేంద్రంగా ఉన్న హిజ్బుల్ ముజాహిదిన్కి చెందిన 4,321డాలర్లు(రూ. 3.15లక్షలు), తెహ్రిక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్‌వి 5,067డాలర్ల(రూ. 3.7లక్షలు) నిధులకు అడ్డుకట్ట వేసింది.
ఇదీ చూడండి:-స్నేహితుడికి 'ఎస్' చెప్పింది.. ఆ తర్వాత?