సౌదీ అరేబియా ప్రభుత్వ కంపెనీ ఆరాంకోకు చెందిన రెండు ప్రధాన చమురు క్షేత్రాలపై యెమనీ తిరుగుబాటుదారులు చేసిన డ్రోన్ల దాడిపై అమెరికా స్పందించింది. ఇది ఇరాన్ పని అయి ఉంటుందని ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఆరోపించారు. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల నడుమ పాంపియో ప్రకటనకు ప్రాధాన్యం నెలకొంది.
"సౌదీ చమురు క్షేత్రాలపై దాడికి యెమెన్ కారణమనడానికి ఆధారాలు లేవు. అయితే చమురు ఉత్పత్తిపై ఇంతకుముందెన్నడూ జరగని దాడిని ఇరాన్ ఇప్పుడు చేసింది. ఇరాన్ దాడిని అన్ని దేశాలు ఖండించాలి. దీనికి కచ్చితంగా ఇరాన్ బదులు చెప్పాల్సిందే." - మైక్ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి.