తెలంగాణ

telangana

ETV Bharat / international

టీకా మేథో సంపత్తి హక్కులపై అమెరికా కీలక నిర్ణయం

కొవిడ్​ వ్యాక్సిన్​లపై మేథో సంపత్తి హక్కులను రద్దు చేసేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. కరోనాపై పోరులో ప్రపంచ దేశాలకు మద్దతునిచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

ోోamerica, joe biden
ఇక అన్ని దేశాల్లోనూ అమెరికా వ్యాక్సిన్లు!

By

Published : May 6, 2021, 5:11 AM IST

Updated : May 6, 2021, 6:53 AM IST

కొవిడ్ మహమ్మారి ముగింపు లక్ష్యంగా.. జరుగుతున్న ప్రయత్నాలకు మద్దతుగా అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేషన్ వేగవంతం చేసే దిశగా కరోనా టీకాలపై.. మేథో సంపత్తి హక్కులను రద్దుచేసేందుకు బైడెన్ ప్రభుత్వం మద్దతు తెలిపింది. ఈ మేరకు అమెరికా వ్యాపార ప్రతినిధి కేథరిన్ టాయ్​ వెల్లడించారు.

"మేథో సంపత్తి హక్కుల పరిరక్షణకు.. బైడెన్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కానీ, కొవిడ్ అంతం కోసం.. కరోనా టీకాలకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్‌ రద్దుచేసేందుకు అమెరికా మద్దతు తెలుపుతోంది."

- కేథరిన్ టాయ్, అమెరికా వ్యాపార ప్రతినిధి

అయితే ఈ అంశంలో ప్రపంచవాణిజ్య సంస్థ సూత్రాలకు అనుగుణంగా... అంతర్జాతీయ ఒప్పందాలు కుదిరేందుకు సమయం పడుతుందని కేథరిన్ టాయ్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కోసం అనేక దేశాలు టీకాలు ఉత్పత్తి చేసేలా... అంతర్జాతీయ వాణిజ్య నియమాలను సరళీకృతం చేసేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) ఇప్పటికే చర్యలు ప్రారంభించింది.

ఇదీ చూడండి:12ఏళ్లు దాటితే వ్యాక్సిన్‌.. కెనడా అనుమతి!

Last Updated : May 6, 2021, 6:53 AM IST

ABOUT THE AUTHOR

...view details