తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనాను ఎదుర్కొనేందుకు తైవాన్​కు అమెరికా ఆయుధాలు - అమెరికా తైవాన్​ ఆయుధాలు

బిలియన్​ డాలర్లు విలువచేసే ఆయుధాలను తైవాన్​కు అమ్మేందుకు అమెరికా నిర్ణయించింది. తైవాన్​ ఆక్రమణకు చైనా సన్నద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో అమెరికా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

US approves USD 1 billion in new arms sales to Taiwan
తైవాన్​కు అమెరికా ఆయుధాల అమ్మకం

By

Published : Oct 22, 2020, 10:41 AM IST

తైవాన్​కు బిలియన్​ డాలర్ల విలువగల అత్యాధునిక ఆయధాలను అమ్మేందుకు అమెరికా అంగీకరించింది. తైవాన్​ ఆక్రమణకు చైనా సన్నద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో అమెరికా చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అదే సమయంలో ఈ నిర్ణయం వల్ల అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. కరోనా సంక్షోభం, హాంగ్​కాంగ్​, వాణిజ్య ఒప్పందం, దక్షిణ చైనా సముద్ర వ్యవహారాలపై ఇరు దేశాల మధ్య బంధం ఇప్పటికే బలహీనపడింది.

భూమిపై దాడులు చేసే 135 మిసైళ్లు, అందుకు సంబంధించిన పరికరాలను అమ్మడానికి పచ్చజెండా ఊపినట్టు అమెరికా అధికారులు వెల్లడించారు. దీనితో పాటు తమ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు తైవాన్​కు పలు కీలక విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు.

తమ దేశ భద్రతను మెరుగుపరుచుకునేందుకు, రాజకీయంగా స్థిరత్వం పొందేందుకు ఈ ఆయుధాల ప్యాకేజీ తైవాన్​కు ఉపయోగపడుతుందని అమెరికా ఆశాభావం వ్యక్తం చేసింది.

తైవాన్​పై ఆధిపత్యం చెలాయించేందుకు గత కొన్నేళ్లుగా చైనా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో తైవాన్​కు అమెరికా ఇప్పటికే అనేకమార్లు అందించిన సహాయంపై చైనా తీవ్రస్థాయిలో మండిపడింది.

ఇదీ చూడండి:-తైవాన్​తో సన్నిహిత సంబంధం చారిత్రక అవసరం!

ABOUT THE AUTHOR

...view details