భారత్-అమెరికా మధ్య సంబంధాలు ఇటీవల కాలంలో బలపడుతున్నాయి. ఇరు దేశాల మధ్య దౌత్య, రక్షణ సహకారంలో భాగంగా కీలక ఒప్పందాలు జరుగుతున్నాయి. తాజాగా భారత్కు సీ-130 జే సూపర్ హెర్క్యులస్ మిలిటరీ యుద్ధ విమానాల అదనపు పరికరాలు, విడి భాగాలను భారత్కు విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది. వీటి విలువ సుమారు 90 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో రూ.663 కోట్లకుపైనే).
ఈ సామగ్రిలో విమాన వినియోగ వస్తువులు, మరమ్మతు/ విడి భాగాలు, అడ్వాన్స్డ్ రాడార్ వార్నింగ్ రిసీవర్ షిప్సెట్, రాత్రివేళలో వినియోగించే 10 తేలికపాటి బైనాక్యులర్స్, నైట్ విజన్ గాగుల్స్, జీపీఎస్, ఎలక్ట్రానిక్ యుద్ధ పరికరాలు ఇతరత్రా ఉన్నాయి.