అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్‌నకు పెన్సిల్వేనియా ఫెడరల్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పెన్సిల్వేనియాలో పోలైన ఓట్లను పరిగణలోకి తీసుకోరాదని ట్రంప్ వేసిన వ్యాజ్యాన్ని ఫెడరల్ అప్పీల్ కోర్టు తిరస్కరించింది. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ట్రంప్ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం.. శుక్రవారం ఇచ్చిన తీర్పును సమర్థించింది. స్వేచ్ఛాయుతమైన ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి జీవనాడి వంటివని న్యాయమూర్తి స్టెఫానొస్ బిబాస్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు.. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలకు రుజువులేవని ప్రశ్నించింది.
పెన్సిల్వేనియా కోర్టులో ట్రంప్‌కు ఎదురుదెబ్బ - Pennsylvania election results
అమెరికా అధ్యక్ష ఫలితాలపై పోరాటం చేస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చుక్కెదురైంది. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ పెన్సిల్వేనియా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ట్రంప్. ఈ వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం.. ట్రంప్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు తీర్పు వెలువరించింది.
నవంబర్ 3న జరిగిన అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల్లో పెన్సిల్వేనియాలో ట్రంప్‌పై.. డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలుపొందారు. పెన్సిల్వేనియా సహా మిషిగాన్, విస్కాన్సిన్ల్లోనూ పైచేయి సాధించారు బైడెన్. ఈ ఎన్నికల్లో ట్రంప్ 232 స్థానాల్లో విజయం సాధించగా.. బైడెన్ 306 స్థానాల్లో గెలుపొంది అధ్యక్ష పీఠాన్ని అధిరోహించేందుకు సిద్ధమయ్యారు. అయితే.. ఓటమిని జీర్ణించుకోలేకపోయిన రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్.. ఎన్నికల ఫలితాలను సవాల్ చేస్తూ కోర్టులో వ్యాజ్యం వేశారు.
ఇదీ చదవండి:'పెన్సిల్వేనియాలో బైడెన్‌దే విజయం'