చైనా అధికారులను అమెరికాలోకి అనుమతించే అంశమై కీలక నిర్ణయం తీసుకుంది అగ్రరాజ్యం అమెరికా. టిబెట్‌తో తాము ఏర్పాటు చేసుకున్న చట్టానికి అనుగుణంగా తమ అధికారులు, పౌరులను అక్కడికి వెళ్లేందుకు అనుతించకపోవడమే ఇందుకు కారణమని తెలిపింది.
"టిబెట్‌కు విదేశీయుల రాకను అడ్డుకోవడంలో భాగమవుతున్న అధికారుల వీసాలపై ఆంక్షలు విధిస్తున్నాం. టిబెట్‌తో పరస్పరం అన్యోన్యంగా ఉండేందుకే ఆశిస్తున్నాం."
-మైక్ పాంపియో ట్వీట్
టిబెట్ భూభాగంలో పర్యటించేందుకు అమెరికాకు చెందిన దౌత్యవేత్తలు సహా ఇతరులెవరినీ చైనా అనుమతించడం లేదని చెప్పారు పాంపియో. అయితే చైనా అధికారులు మాత్రం యథేచ్చగా అమెరికాను సందర్శిస్తున్నారని చెప్పారు. టిబెట్ సందర్శనకు అనుమతించని కారణంగానే చైనా ప్రభుత్వం, కమ్యూనిస్ట్ పార్టీ అధికారుల అమెరికా వీసాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు.
టిబెట్‌లోని సామాజిక వర్గాల ఆర్థిక వృద్ధి, పర్యావరణ పరిరక్షణ, మానవీయ విలువలను పెంచేందుకు ఉద్దేశించిన తమ కార్యాచరణను కొనసాగిస్తామని చెప్పారు పాంపియో.
ఇదీ చూడండి:నేపాల్ స్టాండింగ్ కమిటీ సమావేశం మళ్లీ వాయిదా