కొవిడ్ సెకండ్ వేవ్‌తో.. ఇబ్బందులు పడుతున్న భారత్‌కు అమెరికా మరోసారి సాయం ప్రకటించింది. భవిష్యత్‌లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి.. భారత్‌కు 41 మిలియన్ అమెరికన్ డాలర్లు సాయం చేయనున్నట్లు పేర్కొంది. ఈ 41 మిలియన్లతో కలిపి భారత్‌కు అందే సాయం 200మిలియన్ అమెరికన్ డాలర్లు దాటుతుందని అగ్రరాజ్యం తెలిపింది. ఏప్రిల్, మేలో రోజుకు.. 3 లక్షల కొవిడ్ కేసులు నమోదుకావడం వల్ల ఆక్సిజన్ సహా పడకల కొరతతో భారత్ తీవ్ర ఇబ్బందులు పడింది. అమెరికా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న భారత్‌కు.. ఇప్పుడు అగ్రరాజ్యం అండగా నిలుస్తుందని యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్ఏఐడీ) తెలిపింది. భారత్‌లో కొవిడ్ పరీక్షలు, కొవిడ్ సంబంధిత మానసిక సమస్యలు, వైద్య సేవలు, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాల కల్పనకు అమెరికా సాయం అందిస్తుందని యూఎస్ఏఐడీ ప్రకటించింది. అదనపు నిధుల ద్వారా ఆరోగ్య సేవల వ్యవస్థ, ఆరోగ్య ఎలక్ట్రానిక్ పరికరాలు, వ్యాక్సినేషన్ వంటి కార్యక్రమాలకు సాయం చేయనున్నట్లు వివరించింది.
మరింత సాయం కావాలి..