ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు నిధులు నిలిపివేసిన అమెరికా.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌కు ట్రంప్ ప్రభుత్వం తెలియజేసింది. ఈ నిర్ణయం 2021 జులై 6 నుంచి అమల్లోకి రానుందని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.
అమెరికా ప్రతిపాదనను పరిశీలిస్తున్న ఐరాస
అయితే అమెరికా ఉపసంహరణకు సంబంధించి డబ్ల్యూహెచ్ఓ నిబంధనలను గుటెర్రస్ పరిశీలిస్తున్నట్లు... ఆయన అధికార ప్రతినిధి తెలియజేశారు. డబ్ల్యూహెచ్ఓ షరతులకు అనుగుణంగా అమెరికా ప్రకటన ఉందా అనే విషయాన్ని ధ్రువీకరించే పనిలో ఉన్నట్లు వెల్లడించారు.