కరోనాపై జరుగుతున్న పరిశోధనలే లక్ష్యంగా ఇద్దరు చైనా హ్యాకర్లు విరుచుకుపడుతున్నారని అమెరికా న్యాయశాఖ ఆరోపించింది. దీనితో పాటు ప్రపంచ దేశాల్లోని కంపెనీలకు చెందిన మిలియన్ డాలర్ల వ్యాపార రహస్యాలను వీరు దొంగిలించారని వెల్లడించింది.
ఇటీవలి కాలంలో ఈ హ్యాకర్లు.. కరోనా చికిత్స, వ్యాక్సిన్ కోసం కృషి చేస్తున్న కంపెనీలను లక్ష్యంగా చేసుకుని, వాటి కంప్యూటర్ వ్యవస్థపై దాడి చేసినట్టు అమెరికా న్యాయశాఖ పేర్కొంది. తమకు, చైనా ప్రభుత్వానికి ఉపయోగపడే విలువైన సమాచారాన్ని దొంగిలించినట్టు ఆరోపించింది. ఈ మేరకు హ్యాకర్లపై మోసం, వ్యాపార రహస్యాల దోపిడి కింద నేరాభియోగపత్రం దాఖలు చేసింది.