అమెరికాలో గర్భవిచ్ఛిత్తిపై నిషేధాజ్ఞలు విధించిన రిపబ్లిక్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అబార్షన్ హక్కుల కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. గర్భస్రావానికి చట్టబద్ధత కల్పిస్తూ1973లో అగ్రరాజ్య సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు.. ప్రభుత్వ నిర్ణయంతో నిర్వీర్యం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అబార్షన్లపై నిషేధం విధిస్తూ అమెరికాలోని దక్షిణ రాష్ట్రం అలబామా ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ఇందులో మహిళ పరిస్థితి విషమిస్తే తప్ప... అత్యాచారానికి గురైన వారికీ మినహాయింపు కల్పించలేదు. అలబామాలో నిషేధం విధించిన వారం రోజుల అనంతరం దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, అట్లాంట, జార్జియా రాష్ట్రాల్లోనూ పలువురు నిరసనలు చేపట్టారు.