తెలంగాణ

telangana

ETV Bharat / international

వంట గదిలోకి వచ్చి వైన్​ తాగిన మొసలి - police

అమెరికా ఫ్లోరిడాలోని క్లియర్​వాటర్ ప్రాంతంలోకి ఓ 11 అడుగుల మొసలి ప్రవేశించింది. పొరపాటున ఓ ఇంట్లోకి చేరిన ఆ మొసలిని పోలీసులు పట్టుకుని సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టారు.

ఇంట్లోకి దూరి... మద్యం సేవించిన మొసలి

By

Published : Jun 1, 2019, 5:31 PM IST

ఇంట్లోకి దూరి... మద్యం సేవించిన మొసలి

అమెరికా ఫ్లోరిడాలోని క్లియర్​వాటర్​ ప్రాంతానికి ఓ విశిష్ట అతిథి వచ్చింది. దర్జాగా ఓ ఇంట్లోకి చేరి రెడ్​వైన్​ సేవించింది. ఆ ఇంట్లోని పెద్దావిడను గడగడలాడించి... వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఎవరు ఆ విశిష్ట అతిథి అనుకుంటున్నారా?

అమెరికాలో ఇప్పుడు మొసళ్లు జత కట్టే సమయం. అందువల్ల ఓ పదకొండు అడుగుల మొసలి తన భాగస్వామి కోసం వెతుకుతూ క్లియర్​వాటర్​లోని ఓ ఇంట్లోకి పొరపాటున ప్రవేశించింది. అది చూసిన ఆ ఇంటి యజమానురాలు హడలిపోయింది. మొసలిని గదిలోనే బంధించి పోలీసులకు సమాచారం అందించింది.

"నేను ఆ మొసలి పెద్ద తలను చూశాను. తను నా వైపు చూసి హాయ్ అని పలకరించింది. ఇది మొసలులకు జతకట్టే సమయం. అందుకోసం అవి ఏమైనా చేస్తాయి. అయితే అది నా రెడ్​వైన్​ను ఎందుకు కావాలనుకుందో తెలియదు గానీ, దానిని బాగా ఆస్వాదించింది." - మేరీ విచుసెన్​, క్లియర్​వాటర్ నివాసి.

వెంటనే స్పందించిన పోలీసులు మొసలిని పట్టుకుని సురక్షిత ప్రదేశంలో విడిచిపెట్టారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: పాత కాలం దుస్తుల్లో అలరించిన భామలు

ABOUT THE AUTHOR

...view details