తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో కాల్పుల మోత- ముగ్గురు మహిళలు మృతి - వర్జీనియాలో కాల్పులు

అమెరికా వర్జీనియాలో (us mass shooting latest news) కాల్పులు కలకలం సృష్టించాయి. ప్రజలపై ఓ దుండగుడు కాల్పులు జరపగా.. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు.

mass shooting in virginia
అమెరికాలో కాల్పులు

By

Published : Nov 4, 2021, 12:08 PM IST

అమెరికా వర్జీనియాలోని నార్ఫోక్ నగరంలో (us mass shooting latest news) కాల్పుల మోత మోగింది. ఓ దుండగుడు ప్రజలపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయాలపాలయ్యారు.

నార్ఫోక్ నగరంలో సాయంత్రం ఆరు గంటల సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మరో వ్యక్తిపై కాల్పులు జరిపాడు. అక్కడే ఉన్న ప్రజలు బాధితునికి సహాయం చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో దుండగుడు వారిపై కూడా బుల్లెట్ల వర్షం (mass shooting in america 2021) కురిపించాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి, నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:పీఓకేలో ఘోర ప్రమాదం- 22 మంది దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details