తెలంగాణ

telangana

ETV Bharat / international

Afghanistan news: అఫ్గాన్​ పరిస్థితులపై యూఎన్​ఎస్​సీలో తీర్మానం

అఫ్గానిస్థాన్​లో తాలిబన్ల(Afghnistan Taliban) ఆగడాలు కొనసాగుతున్న క్రమంలో.. అఫ్గాన్​పై ప్రవేశపెట్టిన తీర్మానాన్ని (Afghanistan news) ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్​ఎస్​సీ) ఆమోదించింది. ఇతర దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేందుకు అఫ్గాన్ భూభాగాన్ని ఉపయోగించుకోవద్దని డిమాండ్​ చేసింది. భారత్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.

UNSC
యూఎన్​ఎస్​సీ

By

Published : Aug 31, 2021, 5:06 AM IST

Updated : Aug 31, 2021, 6:24 AM IST

అఫ్గానిస్థాన్​ పరిస్థితులపై(Afghanistan news) ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్​ఎస్​సీ) ఆమోదించింది. అఫ్గాన్ భూభాగం వేదికగా.. ఇతర దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు చేయరాదని, ఉగ్రవాదులకు అఫ్గానిస్థాన్​లో ఆశ్రయం ఇవ్వొద్దని తీర్మానించాయి.

భారత్​ అధ్యక్షతన..

భారత్​ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. అమెరికా, బ్రిటన్​, ఫ్రాన్స్ దేశాలు తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. మండలిలోని 13 దేశాలు తీర్మానాన్ని ఆమోదించాయి. అయితే రష్యా, చైనా మాత్రం ఓటింగ్​కు దూరంగా ఉన్నాయి. అఫ్గానిస్థాన్​ను ఆగస్టు 15న తాలిబన్లు(Afghnistan Taliban) ఆక్రమించుకున్నారు. దీంతో అఫ్గాన్ అధ్యక్షుడు.. ఆ పదవికి రాజీనామా చేసి యూఏఈలో తలదాచుకున్నారు.

అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా, నాటో బలగాల ఉపసంహరణకు గడువు కొద్ది గంటల్లో ముగియనుంది. దేశం విడిచి వెళ్లేందుకు ఆగస్టు 31 చివరి తేదీ కాగా.. ఆ లోపు తమకు సహకరించిన పౌరులను వెనక్కి తీసుకొచ్చేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది.

ఇవీ చదవండి:క్లైమాక్స్​కు అమెరికా-అఫ్గాన్ కథ.. డెడ్​లైన్​కు 24 గంటలే!

Last Updated : Aug 31, 2021, 6:24 AM IST

ABOUT THE AUTHOR

...view details