తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో కరోనా రివర్స్ గేర్- చైనాలో మళ్లీ విజృంభణ - coronavirus deaths

కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో 24 గంటల్లో 15వందలకుపైగా మరణాలు సంభవించాయి. కేసులు, మరణాల సంఖ్యలో తొలిస్థానంలోకి వెళ్లింది. ఆ తర్వాతి స్థానాల్లో ఇటలీ, స్పెయిన్​లు ఉన్నాయి. వైరస్ పుట్టినిల్లు చైనాలో మళ్లీ పుంజుకుంటోంది. కొత్తగా వందకుపైగా కేసులు నమోదయ్యాయి.

United States records
కరోనా మహమ్మారి

By

Published : Apr 13, 2020, 10:16 AM IST

అమెరికాలో కరోనా వైరస్​ ప్రభావం కాస్త తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1514 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందు రోజుతో పోలిస్తే ఈ సంఖ్య తగ్గడం ఊరట కలిగించే విషయం. శనివారం రోజున 1920 మంది మరణించారు.

ఇప్పటి వరకు అగ్రరాజ్యంలో 22,020 మంది మృతి చెందారు. వీటిలో ఒక్క న్యూయార్క్​లోనే 9,385 మరణాలు సంభవించాయి. ప్రపంచంలో ఇదే అత్యధికం కావండ గమనార్హం. వైరస్​ సోకిన వారి సంఖ్యలోనూ అమెరికాదే తొలి స్థానం. ఇప్పటి వరకు మొత్తం 5,59,409 మందికి వైరస్​ సోకింది.

చైనాలో మళ్లీ పుంజుకున్న వైరస్​..

కరోనా వైరస్​కు తొలిసారి గుర్తించిన చైనాలో మళ్లీ పుంజుకుంటోంది ఈ మహమ్మారి. వైరస్​ కట్టడికి కఠిన ఆంక్షలతో వైరస్​ను అడ్డుకున్నట్లు ప్రకటించిన చైనా ప్రభుత్వానికి మరోమారు కేసుల సంఖ్యలో పెరుగుదల సవాలు విసురుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 108 కేసులు నమోదయ్యాయి. వైరస్​కు కేంద్ర బిందువైన హుబే రాష్ట్రంలో ఇద్దరు మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 3,341కి చేరింది. ఇప్పటి వరకు మొత్తం 82,160 కేసులు నమోదయ్యాయి.

ప్రపంచ దేశాల్లో ఇలా..

గత ఏడాది డిసెంబర్​లో చైనాలో కరోనా వైరస్​ను గుర్తించిన నుంచి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 200లకుపైగా దేశాలకు విస్తరించింది. మొత్తం 114,185 మంది మరణించారు. 1.8 మిలియన్లకుపైగా మందికి ఈ మహమ్మారి సోకింది. మరణాల సంఖ్యలో అగ్రరాజ్యం అమెరికా (22,020) అగ్రభాగాన ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో ఇటలీ (19,899), స్పెయిన్ (17,209)​లు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఇలా

ABOUT THE AUTHOR

...view details