తెలంగాణ

telangana

ETV Bharat / international

సిక్కులు, కశ్మీరీ పండితులతో మోదీ భేటీ - కశ్మీరీ పండితుల

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హ్యూస్టన్​లోని సిక్కు సంఘం సభ్యులు, కశ్మీరీ పండిత్​లు, బోరా వర్గం ప్రతినిధులతో సమావేశమయ్యారు. సిక్కుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల హర్షం వ్యక్తం చేశారు పలువురు సిక్కు నేతలు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని అందించారు.

సిక్కులు, కశ్మీరీ పండితులతో మోదీ భేటీ

By

Published : Sep 22, 2019, 9:39 AM IST

Updated : Oct 1, 2019, 1:22 PM IST

సిక్కులు, కశ్మీరీ పండితులతో మోదీ భేటీ

అమెరికా టెక్సాస్​లోని హ్యూస్టన్‌లో సిక్కు సంఘం సభ్యులను కలిశారు ప్రధాని నరేంద్ర మోదీ. సిక్కుల సంక్షేమం కోసం భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల ఆ వర్గం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

మోదీకి సిక్కు సంఘం ప్రతినిధులు ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. 1984 ఊచకోత, దిల్లీ విమానాశ్రయాన్ని గురు నానక్ దేవ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తించడం, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, ఆనంద్ వివాహ చట్టం, వీసా, పాస్‌పోర్టు పునరుద్ధరణ వంటి సమస్యలను పరిష్కరించాలని ప్రధానిని అభ్యర్థించారు.

కశ్మీరీ పండిత్​లతో...

హ్యూస్టన్​లోని కశ్మీరీ పండిత్​లు మోదీని కలిశారు. ఆర్టికల్ 370 రద్దుపై 7 లక్షల మంది పండిత్​ల తరఫున మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం 'నమస్తే శారదే దేవి' శ్లోకా పఠనం కార్యక్రమంలో పాలుపంచుకున్నారు ప్రధాని.

బోరా కమ్యూనిటీతో...

అనంతరం బోరా వర్గం ప్రతినిధులు మోదీని కలిశారు. శాలువాతో ప్రధానిని సన్మానించారు.

ఇదీ చూడండి: మోదీ ఎఫెక్ట్​: చమురు సంస్థల మధ్య కీలక ఒప్పందం

Last Updated : Oct 1, 2019, 1:22 PM IST

ABOUT THE AUTHOR

...view details