తెలంగాణ

telangana

ETV Bharat / international

కోర్టు సంచలన తీర్పు- కామాంధుడికి 600 ఏళ్ల జైలుశిక్ష - United States district court verdict

చిన్నారులను లైంగిక చర్యల ఊబిలోకి దింపిన ఓ కామాంధుడికి నివ్వెరపోయే శిక్ష విధించింది న్యాయస్థానం. ఏకంగా 600 సంవత్సరాల జైలుశిక్ష వేసింది. మ్యాథ్యూ టైలర్‌ మిల్లర్‌ (32) అనే నిందుతుడి కేసులో ఈ తీర్పునిచ్చింది అమెరికా డిస్ట్రిక్ట్‌ కోర్టు.

US district court sentences man to 600 years in prison after accused in child sex case
కామాంధుడికి 600 ఏళ్ల జైలుశిక్ష

By

Published : Oct 3, 2020, 9:06 AM IST

అభం శుభం తెలియని చిన్నారులను లైంగిక చర్యలకు ప్రోత్సహించి, ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్న నేరానికి మ్యాథ్యూ టైలర్‌ మిల్లర్‌ (32) అనే నిందితునికి ఊహించని శిక్ష వేసింది న్యాయస్థానం. 600 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ శుక్రవారం అమెరికా డిస్ట్రిక్ట్‌ జడ్జి స్కాట్‌ కూగ్లర్‌ తీర్పు చెప్పారు. కాటన్‌డేల్‌కు చెందిన మిల్లర్​పై పలు లైంగిక నేరాలకు పాల్పడినట్టు అభియోగాలు ఉన్నాయి.

ఎఫ్‌బీఐ ప్రత్యేక ప్రతినిధి జానీ షార్ప్‌ జూనియర్‌ మాట్లాడుతూ.. నిందితుని వికృత చర్యల వల్ల ఆ చిన్నారుల బాల్యం దోపిడీకి గురైందన్నారు. 2014 - 2019 మధ్యకాలంలో మిల్లర్‌ ఈ దుశ్చర్యలకు పాల్పడ్డాడు. బాధిత చిన్నారుల్లో ఇద్దరు మరీ నాలుగేళ్ల వయసువారని (నేరం జరిగినపుడు) ప్రాసిక్యూటర్లు తెలిపారు.

నిందితుడి గదిని శోధించినపుడు చిన్నపిల్లలకు చెందిన 102 అశ్లీల చిత్రాలు దొరికాయన్నారు. 2019 అక్టోబరులో మిల్లర్‌ తన నేరాన్ని అంగీకరించాడు. పన్నెండేళ్లలోపు వయసున్న చిన్నారితో స్వయంగా లైంగిక చర్యలో పాల్గొన్న అభియోగం కూడా నిందితునిపై ఉంది.

ఇదీ చూడండి: అత్యాచార బాధితురాలి ఆత్మహత్య.. పోలీసులే కారణం!

ABOUT THE AUTHOR

...view details