ఏటా ప్రపంచవ్యాప్తంగా సాంక్రమిక వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం(యూఎన్జీఏ) సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 27ను ''అంతర్జాతీయ అంటువ్యాధుల సంసిద్ధత దినం'గా నిర్వహించాలని తీర్మానించింది. కొవిడ్-19 లాంటి మహమ్మారులను అరికట్టడానికి ప్రపంచవ్యాప్తంగా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. సాంక్రమిక వ్యాధులను ఎదుర్కొనేందుకు దృఢమైన వైద్యవిధానం అవసరమని అభిప్రాయపడింది.
" అంటువ్యాధులు సామాజిక, ఆర్థిక అభివృద్ధికి అవరోధంగా నిలుస్తాయి. ఆరోగ్య సంక్షోభాన్ని సృష్టిస్తాయి. జీవనోపాధిని దెబ్బతీస్తాయి. వీటివల్ల పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు అధికంగా నష్టపోతాయి."