వచ్చే ఏడాది(2021) నుంచి నెలకు 850 టన్నుల కొవిడ్ టీకాలను పంపించే సామర్థ్యం యూనిసెఫ్‌కు ఉందని షిన్హువా అనే వార్తా సంస్థ తెలిపింది. ఇంత పెద్ద మొత్తంలో టీకా పంపిణీ చేయడం కష్టమే అయినా సరఫరా చేసే సామర్థ్యం ఉండడం గొప్ప విషయమని యూనిసెఫ్ కార్యనిర్వాహక డైరెక్టర్ హెన్రిట్టా అన్నారు.
టీకా పంపిణీ కోసం కార్గో విమానాలను యూనిసెఫ్ పరిశీలించింది. అయితే వ్యాక్సిన్ కోసం ఐక్యరాజ్య సమితిలో దరఖాస్తు చేసుకున్న 190 దేశాలలో, 92 పేద నిరుపేద దేశాలకు వాక్సిన్ను వాణిజ్య విమానాలు అందజేయగలవని వార్తాసంస్థ తెలిపింది. ఇందుకు 7 కోట్ల డాలర్లు అవసరమవుతాయని పేర్కొంది.
ఆ 92 దేశాల్లోని 20 శాతం జనాభాకు ప్రస్తుతం యూనిసెఫ్ వద్ద అందుబాటులో ఉన్న కార్గో విమానాలు సరిపోతాయని తెలిపింది. ఆ కార్గో, ప్రయాణికుల విమానాలతో టీకాలను పంపిణీచేయనున్నట్లు వెల్లడించింది.