తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆ విషయంలో భారత్​ను దాటిన చైనా! - చైనా వ్యాక్సిన్ ఎగుమతి

కరోనా వ్యాక్సిన్​ల ఎగుమతిలో భారత్​ను చైనా దాటేసిందని యూనిసెఫ్​ తాజా గణాంకాలు వెల్లడించాయి. గత 6 నెలల్లో చైనా 2.24 కోట్ల డోసులను విదేశాలకు ఎగుమతి చేసినట్లు యూనిసెఫ్​ పెర్కొంది.

china exports
భారత్​ను దాటిన చైనా

By

Published : Jun 23, 2021, 7:06 AM IST

కొవిడ్ టీకాల(Covid vaccine) ఉత్పత్తిలో భారత్​ది అగ్రస్థానమైనా.. విదేశాలకు టీకాల ఎగుమతుల్లో మాత్రం చైనా మనదేశాన్ని దాటిపోయింది. యూనిసెఫ్(UNICEF)​ తాజా గణాంకాల ప్రకారం.. గత 6 నెలల్లో చైనా 2.24 కోట్ల డోసుల టీకాలను విదేశాలకు ఎగుమతి చేసింది.

ముఖ్యంగా ఆఫ్రికా, లాటిన్ అమెరికా, తూర్పు ఐరోపా దేశాలకు డ్రాగన్​ వ్యాక్సిన్​లు వెళ్లాయి. ఆయా దేశాలతో చైనాకున్న ద్వైపాక్షిక ఒప్పందాల మేరకు ఈ ఎగుమతులు జరిగాయి.

పుణె కేంద్రంగా టీకాలు ఉత్పత్తి చేస్తున్న సీరం ఇనిస్టిట్యూట్​ ఆరు నెలల్లో 48 దేశాలకు 88 లక్షల డోసులను ఎగుమతి చేసింది. కొవిడ్ రెండోదశ నేపథ్యంలో ప్రభుత్వం టీకాల ఎగుమతులపై నిషేధం విధించింది.

ఇదీ చదవండి :70 శాతం మందికి తొలి డోసు పూర్తి!

ABOUT THE AUTHOR

...view details